Avinash: జబర్దస్త్ వేదికగా ఎదిగిన కమెడియన్స్ లో ముక్కు అవినాష్ ఒకరు. టీమ్ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాడు. కెవ్వు కార్తీక్ తో కలిసి ఒక టీమ్ లీడర్ గా స్కిట్స్ చేస్తూ ఉండేవాడు. కామెడీ టైమింగ్ తో పాటు మిమిక్రీ అవినాష్ అదనపు బలం. జబర్దస్త్ పై దూసుకుపోతున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో టెంప్ట్ అయ్యాడు. అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. జబర్దస్త్ ని మధ్యలో వదిలేసినందుకు నిర్వాహకులు పది లక్షల రూపాయలు తీసుకున్నారని, సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు కొనసాగిన అవినాష్… రెండు వారాల్లో ఫైనల్ అనగా ఎలిమినేట్ అయ్యాడు.

టైటిల్ దక్కకపోయినా రెమ్యూనరేషన్ రూపంలో బాగానే దక్కినట్లు అవినాష్ వెల్లడించారు. జబర్దస్త్ వాళ్ళకు చెల్లించిన పదిలక్షల తో పాటు తన ఇంటిపై ఉన్న అప్పు తీర్చగలిగాను అన్నారు. అయితే జబర్దస్త్ నుండి బయటికి వచ్చినప్పటికీ స్టార్ మా లో అవినాష్ కి వెంటనే కొత్త షో దొరికింది. కామెడీ స్టార్స్ పేరుతో కామెడీ షో మొదలుపెట్టగా.. అవినాష్ కి టీం లీడర్ గా అవకాశం ఇచ్చారు.
Also Read: ద్రౌపతిని అవమానించిన కౌరవుల భార్యల పరిస్థితి ఏమైందో తెలుసా?
జబర్దస్త్ కి పోటీగా కామెడీ స్టార్స్ షోని నిలపాలని భావిస్తున్న స్టార్ మా యాజమాన్యం సరికొత్త హంగులతో సిద్ధం చేశారు.కామెడీ స్టార్స్ ధమాకా అంటూ పేరు మార్చి జడ్జీగా నాగబాబును తీసుకున్నారు. అలాగే మొన్నటి వరకు ఢీ షోలో సందడి చేసిన దీపికా పిల్లిని యాంకర్ గా తీసుకున్నారు. అలాగే కొన్ని కామెడీ టీమ్స్ కూడా ఎంట్రీ ఇచ్చాయి.

తాజాగా ఆ షో నుండి కూడా అవినాష్ ని దూరం పెట్టారని తెలుస్తుంది. స్కిట్‌లో భాగంగా జిగేల్ జీవన్ ‘ఇది మా అడ్డా’ అని పాట పాడాడు. అప్పుడు అవినాష్.. ‘నేను కూడా మా అడ్డానే అనుకున్నా. కానీ, ఒక ఈవెంట్ కోసం పక్కకు వెళ్లగానే.. నన్ను నాలుగు ఎపిసోడ్లలో లేకుండా తప్పించారు’ అంటూ సరదాగానే సదరు ఛానెల్‌పై ఆరోపణలు చేశాడు. దీంతో ఈ ప్రోమో వీడియో తెగ వైరల్ అవుతోంది. అలాగే అవినాష్ కూడా హైలైట్ అవుతున్నాడు.
ఇక గత ఏడాది వివాహం చేసుకున్న అవినాష్ … భార్యను కూడా పలు ఈవెంట్స్ లో భాగం చేస్తున్నాడు. అవినాష్ భార్య పేరు అనూజ కాగా ఆమె భర్తకు పోటీ ఇస్తూ బుల్లితెర కార్యక్రమాల్లో ఎనర్జీ చూపిస్తుంది. స్టార్ యాంకర్ ఓంకార్ నిర్వహిస్తున్న ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో అవినాష్-అనుజా జంట పాల్గొంటున్నారు.
Also Read: ఏపీ ఎక్స్ ప్రెస్ ఎందుకు అంటుకుంది? మంటలు ఎందుకు వ్యాపించాయి.?