Jetlee Twitter Talk: కామెడీ జానర్ లో డిఫరెంట్ కామెడీ సినిమాలను తీయొచ్చు అని నిరూపించిన డైరెక్టర్ నితీష్ రానా. ‘మత్తు వదలరా’ సిరీస్ లో ఈయన యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక కమెడియన్స్ లో ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న కమెడియన్ సత్య. కంటెంట్ లేని సన్నివేశానికి కూడా నవ్వు రప్పించగల టాలెంట్ ఇతని సొంతం. ఆయన కామెడీ టైమింగ్ కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేదంటే అతిశయోక్తి లేదేమో. ఒకప్పుడు సునీల్ ఎలాగో, ఇప్పుడు సత్య అలా అన్నమాట. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సత్య కి , నితీష్ రానా తోడైతే ఎలా ఉంటుందో ఇది వరకు ‘మత్తు వదలరా’ సిరీస్ లో మనమంతా చూసాము. ఇప్పుడు ఆయన సత్య ని హీరో గా ‘జెట్ లీ’ అనే చిత్రాన్ని చేశాడు. భారీ లెవెల్ లో నేడు విడుదలైన ఈ చిత్రానికి ట్విట్టర్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ వచ్చింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
#JetLee Typical Ritesh Rana style quirky comedy that relies heavily on Satya’s comic timing, but the overall writing falls short!
First half has a few fun and quirky moments that work to an extent, but the setup feels thin. The film loses momentum completely in the second half,…
— Venky Reviews (@venkyreviews) May 1, 2026
ఈ చిత్రం అందరూ ఊహించినంత కామెడీ మోడ్ లో అయితే లేదు కానీ , డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ గా మాత్రం ఉందని అంటున్నారు. అనేక సన్నివేశాల్లో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది అట ఈ సినిమా. ముఖ్యంగా సత్య కామెడీ టైమింగ్ అనేక సన్నివేశాలను వేరే లెవెల్ కి తీసుకెళ్లిందని అంటున్నారు. అంతే కాకుండా ఫస్ట్ హాఫ్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉండేలా చూసుకున్నాడు అట డైరెక్టర్ నితీష్ రానా. కానీ సెకండ్ హాఫ్ చాలా వరకు తగ్గిందని, సత్య కామెడీ టైమింగ్ తో సెకండ్ హాఫ్ లో కూడా అనేక సన్నివేశాలను పైకి లేపాడని , ఓవరాల్ గా ‘మత్తు వదలరా’ సిరీస్ రేంజ్ కామెడీ కాకపోయినా, డీసెంట్ కామెడీ ఎంటెర్టైనెర్ అని , సత్య కోసం ఒకసారి చూడొచ్చని అంటున్నారు.
Emo nakey nachindi emo … Nenu chudina theatre lo Janam kastha fun unnaru.. we were shouting for Satya and had fun. 3/5#JETLEE
— Kauphy (@Kauphy4) May 1, 2026
సత్య నుండి కేవలం కామెడీ టైమింగ్ మాత్రమే కాదు, ఈ చిత్రం లో ఆయన నుండి అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కూడా చూడొచ్చని అంటున్నారు. హీరోయిన్ రియా కూడా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది , ఆమెకు రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు. అదే విధంగా ఈ చిత్రం లో సత్య , వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయని , బాక్స్ ఆఫీస్ పరంగా ఈ చిత్రం వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని , ఎంత మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Dragon bomma ~ hey #Prabhas nuvventi ikkada ?!
Satya timinggguuuu#PRABHAS reference in #JETLEE pic.twitter.com/OsWy5oC6W1
— Karthikuuu (@Anchor_Karthik_) May 1, 2026
#Jetlee 1st half review: Satya’s comedy and screenplay keeps you engaged . It might not be a laugh riot completely but it has decent laugh out moments. Overall okay 1st half but not everyone’s cup of comedy to laugh. It might not appeal to everyone , some might feel it cringe.
— sai raghavendra (@sairaghavendra4) May 1, 2026