Bigg Boss 5 Telugu Promo: బిగ్ బాస్ అంటేనే ఒక పజిల్లాంటిది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. బిగ్ బాస్ లో అనుకోని షాకింగ్ పరిణామం చోటుచేసుకున్నది. బిగ్ బాస్ కంటెస్టెంట్ జస్వంత్ పాదాల (జెస్సీ) గత రెండు వారాలుగా “వర్టిగో” (తల తిరగడం) అనే వ్యాధితో బాధ పడుతున్నాడు. అయితే తాజా గా బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమోలో జెస్సీ ఇంటి నుండి బయటకి వెళ్తున్నట్లు చూపించాడు.
కన్ఫెషన్ రూమ్ కి పిలిచి జెస్సీ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతున్నట్లు ప్రోమో లో మనకి చూపిస్తాడు బిగ్ బాస్. జెస్సీ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగు పడలేదని తప్పనిసరి పరిస్థితి నుండి ఇంటి నుంచి బయటకి రావాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో తీవ్ర భావోద్వాగానికి గురైన జెస్సీ ఈ విషయాన్నీ ఇంటి సభ్యులకి తెలియ చేస్తాడు.
కన్నీరు మున్నీరైన సిరి, షణ్ముఖ్: త్రిమూర్తులుగా బిగ్ బాస్ హౌస్ లో మంచి పేరు సంపాదించుకున్నారు షణ్ముఖ్, సిరి, జెస్సీ. ఫ్రెండ్ షిప్ అంటే వీళ్ళలాగా ఉండాలి అన్నట్టు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ మధ్యలో నుండి ప్రేమ జంటలు, స్నేహ బంధాలు ఏర్పడతాయి కానీ ఈ త్రిమూర్తుల జంట మాత్రం వచ్చిన రెండో రోజు నుండి ఫ్రెండ్ షిప్ ఏర్పరుచుకుని కష్ట సుఖాలు లలో పాలు పంచుకున్నారు. అన్ని బంధాల వలె ఈ త్రిమూర్తుల జంట మధ్య కూడా కలహాలు వచ్చిన మళ్ళీ ఒక్కటయ్యారు. ఇప్పుడు సడన్ గా జెస్సీ ఆరోగ్యం బాగోలేని కారణం గా ఇంటి వీడడం మాత్రం షన్ను, సిరి ని కంట తడి పెట్టించింది.