IITs: ఐఐటీల్లో చదివినా దిక్కులేదు.. ఇవేం జీతాలు స్వామీ.. ఇలాగైతే ఎట్లా బతుకుతారు?

అత్యుత్తమ చదువులకు నిలయాలుగా దేశంలోని ఐఐటీలను భావిస్తారు. ఐఐటీల్లో చదివితే ఉద్యోగం గ్యారంటీ అన్న భావన ఉంది. అంతేకాదు మంచి ప్యాకేజీలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంది. కానీ, ఆ నమ్మకం చెదురుతోంది. పలు ఐఐటీల్లో కనిష్ఠ వేతనం రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలలోపే ఉంటున్నాయి. టాప్‌ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి.

Written By: Raj Shekar, Updated On : September 9, 2024 3:42 pm

IITs

Follow us on

IITs: ఐఐటీలు.. అత్యుత్తమ చదువులకే కాదు.. అత్యుత్తమ వేతన ప్యాకేజీలకు సైతం కేరాఫ్‌ అడ్రస్‌. అయితే వాటిలో చదివిన కొంతమందే టాప్‌ వేతన ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు. చాలామందికి అతి తక్కువ వేతన ప్యాకేజీలే లభిస్తున్నాయి. కానీ టాప్‌ వేతన ప్యాకేజీలకు అత్యధిక ప్రాచుర్యం లభిస్తుంది. పలు ఐఐటీల్లో కనిష్ఠ వేతనం రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకే ఉంటుంది. టాప్‌ విద్యాసంస్థల్లో చదివినా వేతన ప్యాకేజీలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. లేఆఫ్‌లు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఐఐటీల్లోని విద్యార్థుల వేతన ప్యాకేజీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

అధిక వేతనంపై ప్రచారం..
ఇదిలా ఉంటే.. చాలా ఐఐటీలు, కంపెనీలు అధిక వేతన ప్యాకేజీపై విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఫలితంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఐఐటీల్లో చదివించాలని భావిస్తున్నాయి. కానీ, కనిష్ట వేతన ప్యాకేజీల గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు. ప్రచారం చేయడం లేదు. ఇటీవలే తక్కువ ప్యాకేజీలపై వార్తలు వస్తున్నాయి. కనిష్ట వేతనం రూ.7 లక్షలు మించి ఉండడం లేదు. దీంతో ఐఐటీల్లో చదివినా ఏమి ప్రయోజనం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వేతనాల్లో భారీ అంతరం..
ఐఐటీలో చదివిన వారికి అత్యధిక వేతన ప్యాకేజీలకు కనిష్ఠ వేతన ప్యాకేజీల మధ్య అంతరం భారీగా ఉంటుంది. ఐఐటీ మద్రాస్‌లో 2018–19లో గరిష్ఠ వేతన ప్యాకేజీ రూ.29.28 లక్షలు ఉండగా, 2021–22కు వచ్చేసరికి రూ.41.72 లక్షలకు చేరింది. ఇదే విద్యాసంస్థలో కనిష్ఠ వేతన ప్యాకేజీ రూ.5.4 లక్షల నుంచి రూ.6 లక్షలుగా ఉంది. అలాగే ఐఐటీ ఢిల్లీలో 2023లో అత్యధికంగా నెలకు రూ.4.04 లక్షలు ఉండగా, సగటు వేతనం కేవలం రూ.2.63 లక్షలు ఉంది. కనిష్ఠ వేతనం రూ.10 లక్షలలోపే ఉంది. ఐఐటీ బాంబేలో 22 మంది విద్యార్థులు ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీని సొంతం చేసుకోగా, అతి తక్కువ వేతన ప్యాకేజీ రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలుగా ఉంది.