Sobhan Babu: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులలో ఒకప్పుడు స్టార్ హీరో గా గుర్తుకు పొందిన శోభన్ బాబు ఒకరు. ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో సోలో హీరోగా కూడా అతనికి కొన్ని సినిమాల్లో అవకాశాలు రావడం జరిగింది. అతను ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ ని అందుకున్నాడు. ఈయన కృష్ణతో కలిసి చాలా మల్టీస్టారర్ సినిమాల్లో కూడా నటించాడు.
శోభన్ బాబు సినిమాలు అంటే అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా చూసేవారు. అందులో భాగంగానే సోగ్గాడు, గోరింటాకు లాంటి సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి.ఈ సినిమాలకి ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మ రథం పట్టారు.అలాంటి శోభన్ బాబు గారిని ఒకప్పటి స్టార్ హీరోయిన్ అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలిత గారి అమ్మగారు ఆయనని ఎలా అవమానించారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
శోభన్ బాబు ఇండస్ట్రీ లో హీరో గా ఎదుగుతున్న క్రమంలో జయలలిత తమిళంలో ఒక్క ఎంజీఆర్ తోనే 5 సంవత్సరాలలో 32 సినిమాల్లో నటించి నటి గా మంచి గుర్తింపు పొందింది. అలాంటి క్రమంలో శోభన్ బాబు మీడియం రేంజ్ హీరోగా ఉన్నాడు. ఒక సినిమా లో శోభన్ బాబు కి జోడీ గా జయలలిత ని తీసుకుందాం అని మేకర్స్ అనుకున్నారు. కానీ అప్పటికే తమిళం లో జయలలిత స్టార్ హీరోయిన్ గా ఉంది. కాబట్టి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయను అని చెప్పినట్టుగా తెలిసింది.
దాంతో శోభన్ బాబు చాలా బాధపడ్డడట దాంతో అప్పటినుంచి ఆయన ఏ సినిమా చేసిన అందులో జయలలితని హీరోయిన్ గా పెట్టుకొని ఒక సినిమా అయిన చేయాలి అని అనుకునేవాడు. అయితే శోభన్ బాబుతో సినిమా చేయను అని జయలలిత చెప్పలేదు అప్పుడు జయలలిత డేట్స్ వాళ్ళమ్మ అయిన సంధ్య గారు చూసేవారు కాబట్టి ఆమెనే జయలలిత శోభన్ బాబు తో సినిమా చేయదు అని చెప్పిందట.
ఈ విషయాన్ని తర్వాత శోభన్ బాబు మేనేజర్ శోభన్ బాబు కి చెప్పాడు.ఇక స్టార్ హీరోయిన్ గా ఉన్న టైం లో జయలలిత మీడియం రేంజ్ ఉన్న శోభన్ బాబుతో సినిమా చేస్తే తన రేంజ్ పడిపోతుంది అని చెప్పి వాళ్ల అమ్మ నే ఆ సినిమాను క్యాన్సిల్ చేయించింది. దాంతో అప్పటినుంచి శోభన్ బాబు ఆమెతో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని చూశాడు…అయితే ఆ తర్వాత శోభన్ బాబు స్టార్ హీరో అయ్యాక జయలలిత తో చాలా సినిమాలు చేశాడు కానీ జయలలిత వాళ్ల అమ్మ అన్న మాటలు ఆయనని ఎప్పుడు బాదిస్తు ఉండేవట…