Jawan Collections: ఒక సినిమా హిట్టు కావడానికి తెరపై స్టార్ హీరో అయితే.. తెర వెనుక అసలైన హీరో డైరెక్టర్ అవుతాడు. తన మదిలో నుంచి వచ్చిన ఆలోచనలే సినిమా రూపంలో కనిపిస్తాయి. ఇవి బాగుంటే సినిమా హిట్టవుతుంది. అయితే ఎంత ఫేమస్ డైరెక్టర్ అయినా ఒక్కో సినిమా డిజాస్టర్ గా మిగులుతుంది. కానీ ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో ఏదీ అపజయం కాలేదు. పైగా వసూళ్లు డబుల్ సాధించాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన గురించి మీకోసం..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’ సెప్టెంబర్ 7న గురువారం థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ షో నుంచే హిట్టు టాక్ తెచ్చుకుంది. సినిమా పై అంచనా వేసుకున్న విధంగానే రిజల్ట్ రావడంతో చిత్రం యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. జవాన్ లో షారుఖ్ వివిధ గెటపుల్లో కనిపిస్తాడు. యాక్షన్ తోనూ అందరికీ ఆకట్టుకుంటాడు. అదీగాక స్టోరీ లైన్ ఇంప్రెస్ చేస్తుంది. ఇదంతా డైరెక్టర్ అట్లీ మహిమే అని చెప్పొచ్చు. అట్లీ అంటే సినిమాలు తీసి తలపండిన డైరెక్టర్ కాదు. కుర్రాడిలా కనిపించే యంగ్ డైనమిక్.
అట్లీగా పిలుచుకునే అరుణ్ కుమార్ తమిళనాడులోని మధురైలో 1986 సెప్టెంబర్ 21న జన్మించారు. చదువు పూర్తి చేసుకొని డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. ఆయనతో కలిసి ‘రోబో’, ‘స్నేహితుడా’ సినిమాలకు పనిచేశాడు. ఆ తరువాత సొంతంగా ‘రాజా రాణి’ సినిమాకు డైరెక్టర్ గా పనిచేశారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు మురుగుదాస్ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ మూవీని రూ.25 కోట్లతో నిర్మించగా రూ.84 కోట్లు వసూలు చేసింది. తెలుగులోనూ అదే పేరుతో రిలీజై సక్సెస్ సాధించింది.
ఆ తరువాత అట్లీ ఇళయ దళపతి విజయ్ తో కలిసి మూడు సినిమాలు తీశారు. వీటిలో 2016లో ‘తేరి’కి డైరెక్షన్ చేశారు. ఈ సినిమా రూ.75 కోట్లతో నిర్మీతమై రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగులో ‘పోలీసోడు’పేరుతో రిలీజై ఇక్కడా గుర్తింపు తెచ్చుకుంది. మరోసారి విజయ్ తో కలిసి ‘మెర్సల్’ అనే సినిమాకు పనిచేశారు. దీనిని తెలుగులో ‘అదిరింది’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ రూ.120 కోట్లు కాగా.. 200 కోట్లు తెచ్చిపెట్టింది. విజయ్ తోనే మూడోసారి ‘బిగిల్’ను తీశారు. దీనిని తెలుగులో ‘విజిల్’తో రిలీజ్ చేశారు. ఈ సినిమా రూ.180 కోట్లకు రూ.280 కోట్లు సాధించింది.
తాజాగా షారుఖ్ ఖాన్ తో కలిసి తీసిన ‘జవాన్’ కు ఫస్ట్ రోజు నుంచే హిట్టు టాక్ వస్తోంంది. అట్లీ తీసిన సినిమాలన్నీ సక్సెస్ సాధించడంతో పాటు డబుల్ వసూళ్లు సాధించడం విశేషం. అలాగే తన సినిమాల్లో ఎక్కువగా విజయ్, నయనతార లు ఉంటారు. మరికొందరు నటులు కూడా ఎక్కువగా కనిపిస్తారు. నటి కృష్ణ ప్రియను వివాహం చేసుకున్న ఆయన చిన్న తీసింది 5 సినిమాలే. కానీ ఇప్పుడు ఆయన పేరు మారుమోగుతోంది.