https://oktelugu.com/

Jawan Collections: జవాన్ 9వ రోజు వసూళ్లు… షారుక్ ఖాతాలో మరో రికార్డు!

ఎనిమిదో రోజుకు దాదాపు 390 కోట్ల నెట్ వసూళ్లు జవాన్ సినిమా తొమ్మిదో రోజు దాదాపు 21 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. దీనితో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 410 కోట్ల మార్క్ టచ్ చేసింది.

Written By:
  • Shiva
  • , Updated On : September 16, 2023 / 11:37 AM IST

    Jawan

    Follow us on

    Jawan Collections: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టిస్తున్న జవాన్ సినిమా గురించి, ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. విడుదలై దాదాపు 9 రోజులు అవుతున్నా కలెక్షన్స్ విషయంలో స్టడీ గా ముందుకు వెళ్తుంది జవాన్ సినిమా. ఇప్పటికే 700 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఈ సినిమా తొమ్మిదో రోజు వసూళ్లతో మరో రికార్డు ను ఖాతాలో వేసుకుంది.

    ఎనిమిదో రోజుకు దాదాపు 390 కోట్ల నెట్ వసూళ్లు జవాన్ సినిమా తొమ్మిదో రోజు దాదాపు 21 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. దీనితో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 410 కోట్ల మార్క్ టచ్ చేసింది. కేవలం తొమ్మిదో రోజే 400 కోట్ల నెట్ క్లబ్ లోకి చేరింది ఈ సినిమా. ఇక శనివారం, ఆదివారం ఈ సినిమా వసూళ్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదు. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం శనివారం దాదాపు 35 కోట్లు, ఆదివారం మరో 35 కోట్ల పైగా నెట్ వసూళ్లు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

    ఈ వీకెండ్ ముగిసేసరికి 500 కోట్ల నెట్ క్లబ్ లోకి జవాన్ చేరడం ఖాయం. షారుఖ్ ఖాన్ గత సినిమా పఠాన్ కూడా 500 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. 500 కోట్ల నెట్ సాధించటానికి పఠాన్ సినిమాకు దాదాపు 23 రోజులు పట్టింది. కానీ జవాన్ సినిమా కేవలం 12 నుంచి 13 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించే అవకాశం ఉంది. 50 రోజుల్లో పఠాన్ దాదాపు 540 కోట్ల నెట్ సాధించింది. ఆ రికార్డు ను జవాన్ కేవలం 20 రోజుల్లో బద్దలు కొట్టవచ్చు.

    బహుశా ఒకే ఏడాది తన రెండు సినిమాలను 500 కోట్ల క్లబ్ లోకి చేర్చిన ఘనత బహుశా ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీ లో షారుఖ్ ఖాన్ కి మాత్రమే దక్కిందని చెప్పాలి. మరోపక్క ఓవర్శిస్ లో కూడా సత్తా చూపిస్తుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా లో 10 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఒకే ఏడాదిలో రెండు సార్లు 10 మిలియన్ వసూళ్లు సాధించిన మొట్టమొదటి ఇండియన్ యాక్టర్ షారుఖ్ ఖాన్. ఇక జవాన్ ఫైనల్ రన్ ముగిసేనాటికి మరెన్నో రికార్డ్స్ కింగ్ ఖాన్ సొంతం అయ్యే అవకాశం ఉంది.