అనుకున్నదే అయ్యింది. ఈ వారం రిలీజ్ అయిన మూడు సినిమాల్లో ఏదీ హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో.. జాతిరత్నాల జోరు మరింతగా పెరిగింది. మార్చి 19న రిలీజైన మూడు చిత్రాల్లో ఒకటి విష్ణు ‘మోసగాళ్లు’, రెండోది కార్తికేయ ‘చావుకబురు చల్లగా’, మూడోది ఆది ‘శశి’. ఈ మూడు చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అర్జెంటుగా ఒక్క హిట్టు కావాలంటూ వీళ్లు చేసిన ప్రయత్నం.. మరోసారి నీరుగారిపోయినట్టేనని టాక్.
మోసగాళ్లు, చావుకబురు చల్లగా చిత్రాలకు మంచి ప్రమోషనే దక్కింది. కానీ.. స్క్రీన్ పై మాత్రం ఫలితం దక్కినట్టు కనిపించట్లేదు. కథనంపై సరిగా దృష్టి సారించకుండా.. హాలీవుడ్ రేంజ్ లో టెక్నికల్ అంశాల మీదనే దృష్టి పెట్టడం మోసగాళ్లకు మైనస్ అయ్యిందంటున్నారు. ఇంకా.. తెలుగు నేటివిటీ మిస్సవడం కూడా కారణమేనని టాక్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందని ఊరించిన కార్తికేయ మూవీ కూడా.. చప్పగా ఉందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. టేకింగ్ బాగానే ఉందనే మాట వినిపించినప్పటికీ.. జనాలు ఇంట్రస్ట్ చూపించట్లేదు. ఇక, ఆది ‘శశి’ మరింత ఇబ్బంది పెట్టిందని అంటున్నారు. రొటీన్ యవ్వారంతో విసుగెత్తించిందని టాక్.
ఇక, జాతిరత్నాల పరిస్థితి చూస్తే.. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లోనూ కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. యూఎస్ లో లాంగ్ రన్ లో మిలియన్ డాలర్లు కొల్లగొట్టే సినిమాగా రన్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడంతో.. అప్పటి నుంచి లాభాలతోనే గల్లాపెట్టెలు నింపుకుంటున్నారు మేకర్స్.
ఇలాంటి పరిస్థితుల్లో.. వచ్చిన మూడు చిత్రాలు కూడా నిరాశ పరచడంతో.. జాతి రత్నాలకు మరో వారం కలిసి వచ్చింది. ఏపీలో కాస్త క్రౌడ్ తగ్గినప్పటికీ.. తెలంగాణలో మాత్రం జోరు తగ్గలేదు. ఈ విధంగా.. అన్నీ కలిసి వస్తున్న ఈ మూవీ.. లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్ సాధిస్తుందోననే ఆసక్తి నెలకొంది.