Jatadhara Movie Teaser Review: యంగ్ హీరో సుధీర్ బాబు ఈసారి ఓ విభిన్న ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, ప్రెర్నా అరోరా సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. వెంకట్ కళ్యాణ్ – అబ్బిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మైథికల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కు పేరు “జటాధర”.
Also Read: ముస్తాబవుతున్న బాలయ్య – పవన్ కళ్యాణ్..ఇక థియేటర్స్ బద్దలే!
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలకమైన ప్రతినాయక పాత్రలో కనిపించనుండగా, టీజర్ ద్వారా ఆమె పాత్ర అద్భుతంగా భీకరంగా చూపించారు. అదే సమయంలో సుధీర్ బాబు పాత్ర త్యాగం నుండి జన్మించిన శుద్ధశక్తిగా పరిచయం అవుతుంది. ఈ రెండు విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ ఈ కథనానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
టీజర్ విశ్లేషణ
ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ మాటలేమి లేకపోయినా భావాలను ప్రబలంగా చాటుతుంది. చీకటి తాపత్రయంతో జన్మించిన సోనాక్షి పాత్ర పరిచయంతో టీజర్ ప్రారంభమవుతుంది. దానికి విరుద్ధంగా సుధీర్ బాబు దేవత్వంతో కూడిన శక్తిగా రంగప్రవేశం చేస్తారు. చివర్లో శివతత్వాన్ని సూచించే దృశ్యం, ప్రేక్షకులకు గూస్‌బంప్స్ కలిగించేలా ఉంది.
-సాంకేతికంగా కూడా సినిమాకు ప్రత్యేకతే
సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి అంశమూ అత్యున్నతంగా తీర్చిదిద్దారు. ప్రతి ఫ్రేమ్ ఓ కళాఖండంలా కనిపిస్తోంది. టీజర్ మొత్తం ఒక శక్తివంతమైన విజువల్ అనుభూతిగా నిలుస్తుంది.
పాత్రల రూపకల్పన
సుధీర్ బాబు తన పాత్రలో శారీరకంగా మాత్రమే కాకుండా భావోద్వేగాల పరంగా కూడా పూర్తిగా విలీనం అయ్యారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ పాత్రతో సింక్ అవుతూ ఉంటే… సోనాక్షి చీకటి శక్తిగా చూపబడిన తీరు భయానక మాయతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
“జటాధర” టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మానవ లోకం.. దివ్యశక్తుల మధ్య జరిగే ఈ యుద్ధం మంచి-చెడుల మధ్యే కాకుండా శక్తి, త్యాగం, ఆశ, అధర్మం వంటి భావోద్వేగాల సమ్మేళనంగా ఉంటుంది. త్వరలో థియేటర్లలో విడుదలకానున్న ఈ చిత్రం మైథికల్ సూపర్ న్యాచురల్ సినిమాల ప్రేమికులకు ఒక వినూత్న అనుభూతిని అందించనుంది.