Janulyri : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలిచి ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిస్థితి యూట్యూబర్స్ కు కూడా ఎదురవుతుంది. ప్రముఖ డాన్సర్ జాను లిరి రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రముఖ సింగర్ దిలీప్ తో తాను ఎంతో కాలం స్నేహం చేస్తున్నానని.. ఇప్పుడు ఇద్దరం ఒక్కటి కాబోతున్నానని ఓ పిక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే సింగర్ దిలీప్ కుమార్ సైతం జానూ లీరీని పెళ్లి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో జాను లిరి మాజీ భర్త టోనీ కిక్ రెస్పాండ్ అయ్యాడు. ఆయన ఏమన్నాడు అంటే?
డాన్సర్ టోనీ కిక్, జాను లిరి లో గతంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాలవల్ల వీరు దూరమయ్యారు. అయితే ఇద్దరూ యూట్యూబ్ లోనే కొనసాగడంతో ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు చేసిన సమయంలో జాను లిరిక్ తన భర్త గురించి.. టోనీ కిక్ జాను గురించి పలు కామెంట్లు చేశారు. అయితే ఎప్పటికీ కలిసేది లేనని ఇద్దరు ఎవరికి వారే చెప్పారు. కానీ ఇటీవల మళ్ళీ కలుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జానులిరి ఓ షాకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. తనను మానసికంగా హింసిస్తున్నారని, తన కొడుకుతో జీవితాంతం గడపాలని అనుకుంటే.. కొందరు చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆ వీడియోలో పేర్కొంది.
Also Read : కాబోయే భర్తను పరిచయం చేసిన జాను లిరి, ఒక్కరోజు వ్యవధిలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్
అయితే మరుసటి రోజే దిలీప్ కుమార్ తో జీవితాన్ని పంచుకుంటున్నట్లు పేర్కొనడంతో అంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలో జాను మాజీ భర్త టోనీ కిక్ కూడా స్పందించాడు. ఎప్పుడైతే నా జీవితంలో పెళ్లి బ్రేకప్ అయిందో అప్పుడే తోని చనిపోయాడు.. చచ్చి బతికిన టోనీ మీతో మాట్లాడుతున్నాడు. అది కూడా కొందరు స్నేహితుల వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను.. అని టోనీ కిక్ చెప్తూ వచ్చాడు. అలాగే జాను లిరి తో ఎందుకు విడిపోయారు అని అడగగా’ఎందుకు విడిపోయామో చెప్పను. కానీ ఆమె గురించి మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎవరైనా నీ భార్య గుర్తుందా అని అడిగితే.. అసలు గుర్తులేదు అని చెప్పేస్తా.. అయితే కుమారుడి విషయంలోనే చాలా బాధగా ఉంది. అతని జ్ఞాపకాలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. వాటిని చూస్తూ బతికేస్తాను. అయితే వాడికి దూరంగా ఉండలేకపోతున్నాను. కానీ భవిష్యత్తులో కొడుకు కోసం కచ్చితంగా మంచి చేస్తాను…. అని టోనీ కిక్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే జాను లిరి మాత్రం మాజీ భర్త విషయంలో ఎలాంటి కామెంట్ చేయడం లేదు. అంతేకాకుండా తాను ఇష్టం తోనే దిలీప్ కుమార్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పేర్కొంది. కుమారుడు కూడా తనతోనే సంతోషంగా ఉండాలని తెలిపింది.