Mudragada Padmanabha Reddy: ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా లేఖలు రాస్తున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఓటమితో.. రాజకీయ సన్యాసం చేస్తారని అంతా భావించారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించారు ముద్రగడ. తన పేరు మార్చుకుంటానని చెప్పి పద్మనాభ రెడ్డి గా మార్పు చేసుకున్నారు కూడా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు కూడా. ఆయన ఉత్సాహాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించారు.
Also Read: ఆపరేషన్ సింధూర్ లో.. భారత సైన్యం ఆ తొమ్మిది స్థావరాలనే ఎందుకు టార్గెట్ చేసింది?
* పొలిటికల్ రిటైర్మెంట్ పై చర్చ..
వాస్తవానికి ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రిటైర్మెంట్( political retirement) ప్రకటిస్తారని అంత ప్రచారం జరిగింది. ఏడుపదుల వయసులో ఆయన రాజకీయాలకు స్వస్తి పలుకుతారని అంతా భావించారు. అయితే తనకు తాను రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకున్నారు. పవర్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. అయితే ఇప్పుడు వారసుడు కోసం పరితపిస్తున్నారు. కుమారుడు పొలిటికల్ కెరీర్ ను సెట్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం కుమారుడు గిరి ప్రత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. 2029 ఎన్నికల్లో కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలని భావిస్తున్నారు ముద్రగడ. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు.
* కుటుంబానికి పెట్టని కోట..
ముద్రగడ కుటుంబానికి ప్రత్తిపాడు( prathipadu ) నియోజకవర్గ పెట్టని కోట. పద్మనాభం తండ్రి వీర రాఘవరావు 1962, 1967లో అదే నియోజకవర్గంలో నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అటు తరువాత ఆయన వారసుడిగా గర పైకి వచ్చారు ముద్రగడ పద్మనాభం. 1978లో జనతా పార్టీ తరఫున ఇదే సీటు నుంచి పోటీ చేశారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అటు తరువాత మూడుసార్లు అదే నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో ప్రతిపాడులో ఓడిపోయారు ముద్రగడ. నియోజకవర్గాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశానని.. అయినా ప్రజలు ఓడించారని ఆగ్రహించారు. ఇకమీదట అక్కడ నుంచి పోటీ చేయనని శపధం చేశారు.
* ఎంపీ తో పదవులు సరి..
1999లో ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. చివరిసారిగా పదవి దక్కింది అదే. అటు తరువాత 2009లో పిఠాపురం( Pithapuram ) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే పిఠాపురం పై ఆయన మక్కువ పోలేదు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు. ఆయన ఓటమి కోసం ముద్రగడ పద్మనాభం చివరి వరకు పోరాడారు. కానీ పవన్ కళ్యాణ్ గెలుపును ఆపలేకపోయారు. పిఠాపురంలో సైతం తన పరిస్థితి బాగా లేకపోవడంతో తన కుటుంబానికి అచ్చి వచ్చిన ప్రత్తిపాడు పై దృష్టి పెట్టారు ముద్రగడ. ప్రస్తుతం ప్రతిపాడు లో పాగా వేసే పనిలో పడ్డారు. అయితే అది అంత సులువైన అంశం కాదని తేలిపోయింది.
* వైసీపీలో రెండు వర్గాలు..
ప్రస్తుతం ప్రతిపాడు ఎమ్మెల్యేగా టిడిపికి చెందిన వరుపుల సత్యప్రభ( varupula satyaprabha ) ఉన్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వరుపుల సుబ్బారావు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వేర్వేరు వర్గాల ను నాయకత్వం వహిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ముద్రగడ కుమారుడు గిరి కి బాధ్యతలు అప్పగించడంతో వారు సైలెంట్ అయ్యారు. ఆ ఇద్దరు నేతల వర్గాల వారిని ఆకర్షిస్తున్నారు ఎమ్మెల్యే సత్యప్రభ. అక్కడ సైతం ముద్రగడ వారసుడు రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.