Jani Master re-entry into TV show: టాలెంట్ ఉన్న వాళ్ళను ఎవ్వరూ తొక్కలేరు అనడానికి ఎన్నో ఉదాహరణలు మన సినీ ఇండస్ట్రీ లో ఉన్నాయి. అందుకు లేటెస్ట్ ఉదాహరణ జానీ మాస్టర్(Jani Master). గ్రూప్ డ్యాన్సర్ లో ఒకడిగా కెరీర్ ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత రామ్ చరణ్ పుణ్యమా అని కొరియోగ్రాఫర్ గా మారి, అతి తక్కువ కాలం లోనే తన సొంత టాలెంట్ తో టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా మారాడు. అక్కడితో ఆయన ఆగిపోలేదు, తమిళం, కన్నడ , హిందీ భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసి పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆయన టాలెంట్ కు నేషనల్ అవార్డు కూడా దక్కింది. కానీ ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన శ్రేష్టి వర్మ అనే ఒక అమ్మాయి, జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులు చేశాడంటూ గత ఏడాది ఆమె కోర్టు మెట్లు ఎక్కడం సంచలనం గా మారింది.
ఆమె కేసు ని తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్ ని రిమాండ్ లోకి దాదాపుగా నెల రోజుల పాటు విచారించారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అవ్వడం వల్ల ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దు అయ్యింది. ఆకాశాన్ని అంటిన తన కెరీర్ గ్రాఫ్ రెప్పపాటు క్షణం లో పాతాళం లోకి పడిపోయినట్టుగా అయిపోయింది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ ని చూసి, ఒకప్పటి కెరీర్ ఈయనకు మళ్లీ ఉంటుందా అని అంతా అనుకునే వారు. కానీ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు అనేది జానీ మాస్టర్ విషయం లో మరోసారి రుజువు అయ్యింది. రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ లో సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసుకునే అవకాశం ఇచ్చాడు. తనకు ఇచ్చిన ఆ అద్భుతమైన అవకాశాన్ని జానీ మాస్టర్ పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నాడు.
అలా వినియోగించుకోవడం వల్లే ‘చికిరి..చికిరి’ పాట బయటకు వచ్చింది. గ్లోబల్ వైడ్ గా ఈ పాట క్రియేట్ చేసిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు జానీ మాస్టర్ కంపోజ్ చేసిన పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియా లో ఎన్నో లక్షల వీడియోస్ ని అప్లోడ్ చేశారు. ఇకపోతే ఒకప్పుడు జానీ మాస్టర్ టీవీ షోస్ లలో జడ్జిగా ఎక్కువగా కనిపించేవాడు. ఆ ఘటన జరిగిన తర్వాత మళ్లీ వస్తాడా అని అనుకునేవారు నెటిజెన్స్. కానీ టీవీ షోస్ లో కూడా ఆయన గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చేసాడు. త్వరలోనే జీ తెలుగు లో ‘ఆట’ అనే డ్యాన్స్ ప్రోగ్రాం మొదలు కానుంది. ఈ ప్రోగ్రాం కి సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తుండగా, జానీ మాస్టర్, సీనియర్ హీరోయిన్ రాధికా మరియు నిహారిక కొణిదెల జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో ని మీరు కూడా చూసేయండి.