https://oktelugu.com/

Jani Master: జానీ మాస్టర్ నిర్దోషా..? సంచలనం రేపుతున్న ఆడియో రికార్డు..బాధితురాలి బెదిరింపులు మామూలుగా లేవుగా!

తమిళం లో ధనుష్ హీరో గా నటించిన 'తిరు' చిత్రంలో ఒక పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ చేసినందుకు గాను ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు దక్కింది. ఈ అవార్డు ని అందుకోవడం కోసం ఆయన ప్రత్యేకంగా బెయిల్ కోరుతూ పిటీషన్ వేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 04:42 PM IST

    Jani Master(1)

    Follow us on

    Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి చంచల్ గూడా జైలు రిమాండ్ సెల్ లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ కొన్ని రోజులు ఆయనని విచారించిన పోలీసులు, తదుపరి విచారణ కోసం కస్టడీ కి తరలించారు. అక్కడ ఆయన అందించిన కొన్ని కీలక ఆధారాలను పరిగణలోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఇదంతా పక్కన పెడితే రేపు జానీ మాస్టర్ బెయిల్ మీద విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమిళం లో ధనుష్ హీరో గా నటించిన ‘తిరు’ చిత్రంలో ఒక పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ చేసినందుకు గాను ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు దక్కింది. ఈ అవార్డు ని అందుకోవడం కోసం ఆయన ప్రత్యేకంగా బెయిల్ కోరుతూ పిటీషన్ వేసాడు. ఆ పిటీషన్ ని పరిశీలించిన పోలీసులు జానీ మాస్టర్ కి బెయిల్ మంజూరు చేసింది. ఇదంతా పక్కన పెడితే జానీ మాస్టర్ నిర్దోషి అని నిరూపించే కొన్ని ఆధారాలను ఆయన సతీమణి సుమలత ఫిలిం ఛాంబర్ కి అందించింది.

    ఆ ఆధారాల్లో ఆమె ఇచ్చిన ఒక ఆడియో రికార్డు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఈ ఆడియో రికార్డు లో ఆమె జానీ మాస్టర్ కార్ డ్రైవర్ తో మాట్లాడుతూ ‘ఏమైంది నా ఫోన్ ఎత్తుకోవట్లేదు..అంత బిజీ గా ఉన్నారా?, నిన్న ఆయన ఒక అమ్మాయిని డ్రాప్ చేయడం చూసాను, చాలా ఫీల్ అయ్యాను. న్యూ ఇయర్ రోజు ఆయనతో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చాయి, అందుకే ఆ వీడియో ని అప్లోడ్ చేశాను. ఆయనకి కోపం రావాలనే ఆ వీడియో ని నేను అతనికి కూడా పంపాను. ఆయన నాకు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇచ్చాడు. అవి తిరిగి కావాలా?, కావాలంటే ఆయననే వచ్చి తీసుకోమని చెప్పు. ఇచ్చేస్తాను, కానీ నేను ఆయనకి ఒక వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాను, అది నాకు అవసరం లేదు, కావాలంటే చెత్త బుట్టలో పడేయమను. నేను అతన్ని పెళ్లి చేసుకోమని అడిగాను, అది అక్కకి తెలిసిపోయింది, అప్పటి నుండి ఆయన నాతో మాట్లాడడం లేదు’ అంటూ ఆ ఆడియో లో జానీ మాస్టర్ కార్ డ్రైవర్ తో ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

    చూస్తుంటే జానీ మాస్టర్ వైపు పూర్తిగా తప్పు లేనట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు ఇష్టంతోనే రిలేషన్ మైంటైన్ చేసారు, ఆ అమ్మాయి కేసు పెట్టినట్టుగా ఎలాంటి లైంగిక వేధింపులు కానీ, అత్యాచారం చేసినట్టుగా కానీ అనిపించలేదు. జానీ మాస్టర్ తనకు లొంగలేదు అనే కారణంతోనే ఆమె పోలీస్ కేసు పెట్టినట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది. మరి దీనికి శ్రేష్టి వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో, ఆమె వైపు నుండి కూడా ఏదైనా ఆడియో రికార్డ్స్ వస్తుందో లేదో చూడాలి.