ఈ సినిమా తర్వాత ఆమె మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేసేందుకు సంతకాలు చేసింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక స్టోరీ ఎన్టీఆర్ అభిమానులకు కాస్త ఆగ్రహం తెచ్చేలా ఉంది. ఆమె మాట్లాడుతూ ‘ ఈ ఏడాది ది బెస్ట్ చిత్రం నా దృష్టిలో అమరన్. ఈ చిత్రం చూడడం ఆలస్యమైంది. ఈ చిత్రం లోని ప్రతీ సన్నివేశం నా మనసుని కదిలించింది. ఇంత ఎమోషన్స్ ఉన్న సినిమాని ఈమధ్య కాలం లో నేనెప్పుడూ చూడలేదు. ఒక మంచి సినిమాతో ఈ ఏడాదిని ముగించాను అనే సంతృప్తి కలిగింది’ అంటూ చెప్పుకొచ్చింది. దీనికి కొంతమంది కామెంట్స్ చేస్తూ నీకు మొట్టమొదటి హిట్ ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్, నీపై ఐరన్ లెగ్ ముద్ర తీసేలా చేసింది ‘దేవర’ చిత్రం, అలాంటి సినిమాని బెస్ట్ అనకుండా వేరే సినిమాని అంటావా అంటూ జాన్వీ కపూర్ పై మండిపడుతున్నారు.
అయితే మనసులో ఉన్న మాటని నిర్మొహమాటంగా చెప్పినందుకు జాన్వీ కపూర్ ని అభినందించాలని, ‘దేవర’ చిత్రం వేరే లెవెల్ సినిమా అని మనం కూడా చెప్పలేము అంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు జాన్వీ కపూర్ ని వెనకేసుకొస్తున్నారు. గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 350 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, భారీ ఓపెనింగ్ వసూళ్లను రాబట్టి, కేవలం 370 కోట్ల రూపాయిల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది. దీనిని బట్టి ‘అమరన్’ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఓటీటీ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో హాలీవుడ్ సినిమాలను సైతం డామినేట్ చేసి టాప్ లో ట్రెండ్ అవుతుంది.