Devara – Janhvi Kapoor : ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న రెండో చిత్రం దేవర. ఈ చిత్రంపై ఇండియా వైడ్ అంచనాలున్నాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రం కావడం మరొక విశేషం. ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో దేవర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఏడు నెలలు నిరవధికంగా హైదరాబాద్ లో షూటింగ్ జరిపారు. మేజర్ షూటింగ్ సెట్స్ లో పూర్తి చేశారు.
ప్రస్తుతం అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళింది యూనిట్. గోవాలో ఎన్టీఆర్ మీద యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. ఇక దేవర మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. గోవా షెడ్యూల్ లో ఆమె కూడా పాల్గొంటున్నారట. కాగా దేవర సెట్స్ నుండి జాన్వీ కపూర్ లుక్ లీకైంది. లంగా ఓణీలో చాలా సింపుల్ గా ఉంది జాన్వీ. ఆ గెటప్ చూస్తే పల్లెటూరి ఆడపిల్ల ఛాయలు కనిపిస్తున్నాయి.
విశేషం ఏమిటంటే జాన్వీ కపూర్ పాత్ర పేరు… తంగం అట. చాలా భిన్నంగా ఉన్న ఈ పేరు వెనుక ఆసక్తికర కథనం ఉంది. జాన్వీ తల్లి శ్రీదేవి 1970లో విడుదలైన ఎన్ అన్నమ్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ మూవీలో శ్రీదేవి పాత్ర పేరు తంగం. అదే పేరును దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రకు పెట్టారు. లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవికి ట్రిబ్యూట్ గా దర్శకుడు కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
జాన్వీ పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందని కొరటాల ఇప్పటికే చెప్పారు. దేవర జాన్వీ కపూర్ ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. ఇక ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు.
Janhvi Kapoor from #Devara @tarak9999 pic.twitter.com/OJfg3OXegm
— Nandipati Murali (@NtrMurali9999) October 31, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Janhvi kapoors look from devara leaked
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com