Janhvi Kapoor: సీనియర్ శ్రీదేవి.. చాలామంది హృదయాలను కొల్లగొట్టింది. అందంతోపాటు అభినయంలోనూ ఆమెకు ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అయితే తన డ్రీమ్ గర్ల్ శ్రీదేవి అని బహిరంగంగా ప్రకటించారు. దేశం గర్వించే నటీమనిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి కూతురుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్. అయితే ఊహించినట్టు తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకోలేక సతమతమవుతోంది. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకుల మన్ననలు అందుకోలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ కపూర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా ఆమె నటించిన గుడ్ లక్ జెర్సీ సినిమా ప్రమోషన్లో సాల్గొన్న జాన్వీ బాలీవుడ్ అగ్రహీరోలపై చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఊగిసలాటలో కెరీర్..
జాన్వీ కపూర్ ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆమె నటించిన గుంజన్ సక్సెనా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన రూహీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఆమె నటించిన గుడ్ లక్ జెర్నీ సినిమా డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం అవుతున్నది. తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు నెల్సన్ కుమార్ రూపొందించిన కొలమావు కోకిల సినిమా ఆధారంగా గుడ్ లక్ జర్నీ సినిమా తెరకెక్కింది. అయితే ఆ చిత్రాన్ని రీమేక్ చేయడంలో దర్శకుడు తడబాటుకు గురయ్యాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది.
Also Read: Ravi Teja: ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసిన రవితేజ

షారుక్, సల్మాన్, అమీర్‌తో నటిస్తావా?
ఇక గుడ్ లక్ జెర్నీ సినిమా రిలీజ్‌కు ముందు జాన్వీ కపూర్ ముంబై మీడియాతో మాట్లాడింది. తాజా ఇంటర్యూలో షారుక్‌ఖాన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ లాంటి సూపర్ స్టార్స్‌తో నటిస్తావా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. వారితో నటించడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. ‘వాళ్లు చాలా సీనియర్ నటులు.. వారితో నటించడం సమంజసంగా ఉండదు. వారి వయసు, నా వయసుకు చాలా గ్యాప్ ఉంటుంది. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న వారితో నటిస్తే.. ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమే’ అని అభిప్రాయపడింది. అయితే తెలుగులో ఎన్టీఆర్‌తో నటించడం నా డ్రీమ్. అలాగే వరుణ్ ధావన్, రణ్‌బీర్ కపూర్ కూడా నటిస్తా అని చెప్పింది.