‘అతిలోక సుందరి శ్రీదేవి’కి ఒక కోరిక ఉంది. తన ముద్దుల కూతుర్లు సౌత్ సినిమాల్లో నటించి సౌత్ ప్రేక్షకులను అలరించాలని శ్రీదేవి ఎప్పుడు తపన పడుతూ ఉండేది. అందుకే, శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించింది. ఈ క్రమంలోనే జాన్వీని తెలుగులో పరిచయం చేయాలని ఇప్పటికే కొందరు నిర్మాతలు ప్రయత్నించి విఫలం అయ్యారు.
కారణాలు తెలియదు గానీ, బోనీ కపూర్ చాలా సినిమాలను రిజక్ట్ చేశాడు. మొదట జాన్వీ కపూర్ కి విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ, బోనీ ఆ ఆఫర్ ను వద్దు అనుకున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ – శంకర్ సినిమాలో కూడా జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇది కూడా మిస్ అయింది.
అలాగే ప్రభాస్ సినిమాను కూడా ఆమె వదులుకున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇలా పలువురు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినా జాన్వీ కపూర్ మాత్రం నటించలేక పోయింది. ఇప్పుడు ఆమెకు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రాబోతున్న ఐకాన్ సినిమాలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు.
సహజంగా అల్లు అర్జున్ కు ఒక అలవాటు ఉంది. తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడానికి బన్నీ ఇంట్రెస్ట్ చూపించడు. అయితే, పూజా హెగ్డేని ఇప్పటికే రెండు సార్లు రిపీట్ చేశాడు. ఇప్పుడు ఐకాన్ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా పెట్టుకుందాం, పాన్ ఇండియా మార్కెట్ కి హెల్ప్ అవుతుందని దిల్ రాజు ప్రపోజల్ పెట్టాడట.
కానీ, దానికి బన్నీ అంగీకరించలేదు. ‘ఐకాన్’ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ ను పెట్టుకుందాం అంటూ బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డైరెక్టర్ జాన్వీ కపూర్ పేరును సజెస్ట్ చేశాడట. బన్నీ, జాన్వీ కపూర్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరీ, జాన్వీ కపూర్ ఒప్పుకున్నా.. బోనీ కపూర్ ఒప్పుకుంటాడా ? లేదా ? అనేది చూడాలి.