Janhvi Kapoor: జాన్వీ కపూర్ కెరీర్ ఊపందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ పరిశ్రమలో అడుగుపెట్టి చాలా కాలం అవుతున్నా బ్రేక్ రాలేదు. స్టార్ కిడ్ అయినప్పటికీ బడా హీరోలు అవకాశాలు ఇవ్వలేదు. దాంతో ఆమె సౌత్ ఇండియా పై కన్నేశారు. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి సౌత్ కి చెందిన హీరోయిన్. ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎనలేని స్టార్డం అనుభవించారు. శ్రీదేవితో కలిసి నటించిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోల వారసులు జాన్వీ కపూర్ తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.
ఆల్రెడీ దేవర మూవీలో ఎన్టీఆర్ తో జతకట్టింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్లు మాత్రం గట్టిగానే రాబట్టింది. అయితే జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే వాదన వినిపించింది. దేవర విడుదల కాకుండానే రామ్ చరణ్ ఆర్సీ 16లో జాన్వీ కపూర్ ఆఫర్ పట్టేసింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది.
ఆర్సీ 16 పై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో బుచ్చిబాబు సాన ఈ ప్రాజెక్ట్ రూపొందించనున్నారు. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ పెళ్లి పై స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి తన అభిప్రాయం అడగగా.. నేను తిరుమల దేవస్థానంలో వివాహం చేసుకుంటానని కుండబద్ధలు కొట్టింది. తనకు తిరుమల అత్యంత ఇష్టమైన ప్రదేశం. శ్రీవారిని ఎంతగానో పూజిస్తాను.
భవిష్యత్ లో భర్త, పిల్లలతో తిరుమలలో సెటిల్ కావాలి అనేది నా కోరిక. నేను అదే చేస్తాను.. అన్నారు. జాన్వీ నిర్ణయం వెనుక కారణం లేకపోలేదు. శ్రీదేవి సైతం తిరుమల వేంకటేశ్వరుని భక్తురాలు. తరచుగా తిరుమలను శ్రీదేవి సందర్శిస్తూ ఉండేవారు. శ్రీదేవి మరణం అనంతరం జాన్వీ కపూర్ ఈ సాంప్రదాయం కొనసాగిస్తోంది. ప్రతి ఏటా పలుమార్లు తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శనం చేసుకుంటుంది. అదన్నమాట మేటర్. ముంబై వంటి ఆల్ట్రా మోడ్రన్ సిటీలో పుట్టి పెరిగిన జాన్వీ కపూర్, తిరుమలలో సెటిల్ అవుతానని చెప్పడం గొప్ప పరిణామం.
మరోవైపు జాన్వీ కపూర్ తరచుగా ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటు ఉంటుంది. పలువురు కుర్ర నటులు, వ్యాపారవేత్తలతో ఆమె రిలేషన్ నడిపారనే వాదన ఉంది. ఓ క్రికెటర్ తో జాన్వీ కపూర్ సన్నిహితంగా ఉంటున్నారంటూ ఇటీవల మరో పుకారు తెరపైకి వచ్చింది.