Janhvi Kapoor Peddi First Look: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా అయినప్పటికి ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబట్టింది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు రామ్ చరణ్ ను మించిన స్టార్ హీరో మరొకరు లేరనేంతలా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సంవత్సరంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అందుకే ఆయన ఇకమీదట చేసే ప్రాజెక్టులను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్ పేరు చెబితే చాలు చాలా మంది అభిమానులు ఆయనకి నీరాజనాలు పడుతున్నారు. ఇప్పుడు పెద్ది సినిమా కోసం ఇండియా వైడ్ గా ఉన్న చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…
ఈ మూవీలో రామ్ చరణ్ రూరల్ ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు జాన్వీ కపూర్ కి సంబంధించిన ఎలాంటి క్లూ కూడా ఇవ్వలేదు. కానీ గత కొద్దిసేపటికి క్రితమే సినిమా యూనిట్ కి సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో ‘అచ్చయమ్మ’ అనే పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈమె ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే మహిళాగా కనిపించబోతుందట…ఇక ఆమె క్యారెక్టర్ కి సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేయడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద మంచి అంచనాలలైతే పెట్టేసుకుంటున్నారు. ఆమె జీప్ లో నిలబడి నమస్కారం పెట్టడం కూడా వెటకారంగా ఉందని ఆమె క్యారెక్టర్ ను ఒక్క పిక్ తో చాలా బాగా డిజైన్ చేశారని పలువురు సినిమా మేధావులు కామెంట్లు చేస్తున్నారు…ఇక ఈ సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం డిసప్పాయింట్ చేయదని బుచ్చిబాబు గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
ఇక ఈ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో పాన్ ఇండియాలో ఆయన స్టార్ డైరెక్టర్ గా మారతాడా లేదా అనేది…ఇక ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు…