https://oktelugu.com/

నెలకు రూ.1,500 కడితే రూ.50 లక్షలు.. ఎలా అంటే..?

తక్కువ మొత్తం ఆదా చేసి ఎక్కువ డబ్బును సంపాదించాలని అనుకుంటున్నారా..? అలా చేయాలని అనుకుంటే మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. నెలకు కేవలం 1,500 రూపాయలు అదా చేయడం ద్వారా ఏకంగా 50 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా క్యాలిక్యులేటర్ లెక్కల ప్రకారం 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ఈ మొత్తం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 13, 2021 6:28 pm
    Follow us on

    తక్కువ మొత్తం ఆదా చేసి ఎక్కువ డబ్బును సంపాదించాలని అనుకుంటున్నారా..? అలా చేయాలని అనుకుంటే మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. నెలకు కేవలం 1,500 రూపాయలు అదా చేయడం ద్వారా ఏకంగా 50 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా క్యాలిక్యులేటర్ లెక్కల ప్రకారం 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ఈ మొత్తం పొందవచ్చు.

    నెలకు 1,500 రూపాయల చొప్పున క్రమం తప్పకుండా 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 12 శాతం రాబడిని పరిగణనలోకి తీసుకుంటే చేతికి ఏకంగా 53 లక్షల రూపాయలు వస్తాయి. రోజుకు కేవలం 50 రూపాయలు ఆదా చేయడం ద్వారా ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఆదాయం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. నెలకు రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత రూ.35 లక్షలు వస్తాయి.

    దీర్ఘకాలం పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ ఉంటే మాత్రమే ఈ మొత్తాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. తక్కువ మొత్తంతో ఎక్కువ లాభం పొందాలని అనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

    ప్రస్తుతం ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ లలో ఇది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.