జాన్వీ కపూర్ డబ్బు కోసమే అవి చేస్తోందట !

‘అతిలోక సుందరి శ్రీదేవి’ ముద్దుల తనయ జాన్వీ కపూర్ కి ప్రస్తుతం బాగా బోర్ కొడుతోందట. అందుకే యాడ్స్ కోసం మేనేజర్లతో సంప్రదింపులు జరుపుతోంది ఈ యంగ్ బ్యూటీ. ఈ క్రమంలో ఒక యాడ్ కూడా చేయడానికి ఒప్పుకుంది. ఒక కూల్ డ్రింక్ కంపెనీకి ఆ యాడ్ చేయబోతుంది. వచ్చే వారం నుండి ఈ యాడ్ షూట్ మొదలుకానుంది. ఏది ఏమైనా డబ్బు కోసం జాన్వీ యాడ్స్ చేస్తోందంటూ ఆమె పై అప్పుడే విమర్శలు చేసేస్తున్నారు బాలీవుడ్ […]

Written By: NARESH, Updated On : May 14, 2021 1:48 pm
Follow us on

‘అతిలోక సుందరి శ్రీదేవి’ ముద్దుల తనయ జాన్వీ కపూర్ కి ప్రస్తుతం బాగా బోర్ కొడుతోందట. అందుకే యాడ్స్ కోసం మేనేజర్లతో సంప్రదింపులు జరుపుతోంది ఈ యంగ్ బ్యూటీ. ఈ క్రమంలో ఒక యాడ్ కూడా చేయడానికి ఒప్పుకుంది. ఒక కూల్ డ్రింక్ కంపెనీకి ఆ యాడ్ చేయబోతుంది. వచ్చే వారం నుండి ఈ యాడ్ షూట్ మొదలుకానుంది.

ఏది ఏమైనా డబ్బు కోసం జాన్వీ యాడ్స్ చేస్తోందంటూ ఆమె పై అప్పుడే విమర్శలు చేసేస్తున్నారు బాలీవుడ్ జనం. నిజానికి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా, మొదటి నుండి జాన్వీ కపూర్ తనకంటూ ఒక ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఫస్ట్ సినిమా ‘ధడక్’ సినిమాతో పాస్ మార్కులే తెచ్చుకున్నా.. ఆ మార్కులతో సంబంధం లేకుండా ఆ తరువాత గ్లామర్ ప్రపంచంలో తానూ ఓ తారలా మెరిసిపోవడం అలవాటు చేసుకుంది.

ఇక ప్రస్తుతం జాన్వీ చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. పైగా సినిమాలతో పాటు మధ్యమధ్యలో యాడ్స్ కూడా చేసుకుంటూ మొత్తానికి రెండు చేతులా సంపాదిస్తోంది. ఒక విధంగా అప్పుల్లో ఉన్న బోణి కపూర్ ను ఆదుకుంటుంది కూడా జాన్వీనేనట. అన్నట్టు తానూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ హాట్ ఫోటో షూట్లు చేయడం మాత్రం జాన్వీ అసలు మానుకోదు. ఎలాగూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి,

తన హాట్ ఫోటోలను రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ సోషల్ మీడియా నుండి కూడా బాగానే సంపాదిస్తోంది. ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ‘రూహి అఫ్జానా’.. ‘దోస్తానా 2’ చిత్రాలలో నటిస్తోంది. అలాగే ఆమె చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.