Jana Nayagan Vs Bhagavanth Kesari: తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న జన నాయకుడు అనే సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది…ఇక ఈ సినిమా బాలయ్య హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తూ వచ్చాడు. ఇక ఇలాంటి నేపథ్యంలో జననాయకుడు మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. అది భగవంత్ కేసరి సినిమా మాదిరిగానే ఉంది. బాలయ్య బాబు ఎలాంటి క్యారెక్టర్ లో అయితే కనిపించాడో విజయ్ అదే క్యారెక్టర్ లో కనిపిస్తుండటం విశేషం…ఇక రెండు సినిమాలు ఒకే కథలో తెరకెక్కాయి కాబట్టి జన నాయకుడు సినిమా అఫీషియల్ గా భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని చెప్పడానికి జన నాయకుడు టీమ్ ఎందుకంత సంకోచించింది.
ఈ విషయం ఎప్పటికైనా తెలిసేదే కదా అంటూ దర్శకుడి మీద కొంత మంది ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు… ఇక ఇదిలా ఉంటే జన నాయకుడు భగవంత్ కేసరి సినిమాల మధ్య పోలికలు ఉన్నప్పటికి ఒక విషయంలో మాత్రం తేడా అయితే కనిపిస్తుందంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…
అయితే ఈ రెండు సినిమాల మధ్య జన నాయకుడు సినిమా కొంచెం ఎక్కువ గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమా కథ కూడా కొంతవరకు మార్చినట్టుగా తెలుస్తోంది. 90% కథ ఒకే విధంగా ఉన్నప్పటికి చిన్న మార్పులు చేర్పులు చేసి సినిమాను తెర మీదకి తీసుకొస్తున్నారు. భగవంత్ కేసరి మూవీలో ఉమన్ ఎంపవర్ మెంట్ గురించి చాలా అద్భుతంగా చూపించారు.
కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక జన నాయకుడు సినిమాలో సైతం అదే ప్రధానాంశంగా తెరకెక్కుతోంది కాబట్టి ఈ మూవీ కూడా తమిళంలో చాలా పెద్ద హిట్ అవుతుందంటూ పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కకపోవచ్చు. కానీ తమిళనాడులో మాత్రం మంచి సక్సెస్ ని సాధించడమే కాకుండా భారీ కలెక్షన్స్ ను రాబడుతుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు…