Jana Nayagan Teaser: గడిచిన మూడేళ్ళలో సౌత్ మొత్తం మీద విడుదలైన టీజర్స్, గ్లింప్స్ వీడియోస్ లలో అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకున్న గ్లింప్స్ వీడియో ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) గ్లింప్స్ వీడియోనే. ఈ గ్లింప్స్ వీడియో లో డైరెక్టర్ సుజీత్ మేకింగ్ స్టైల్,పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని చూసి అందరూ మెంటలెక్కిపోయారు. ఒక్కొక్క షాట్ డైరెక్టర్ తెలివికి పరాకాష్ట లాగా నిల్చింది. అందుకే ఈ గ్లింప్స్ వీడియో కి అంతటి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూసేలా చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25 న ఈ క్రేజీ చిత్రం విడుదల కాబోతుంది. అయితే ఓజీ గ్లింప్స్ వీడియో ని ఆదర్శంగా తీసుకొని ఈమధ్య కాలంలో అనేక టీజర్స్, గ్లింప్స్ వీడియోస్ తయారు అవుతున్నాయి.
Also Read: విజయ్ దేవరకొండ పై కేసు నమోదు.. క్షమాపణలు వృధా అయ్యినట్టేనా!
వివరాల్లోకి వెళ్తే నేడు తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరో గా నటిస్తున్న ‘జన నాయగన్'(Jana nayagan) చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. సరిగ్గా నిన్న అర్థరాత్రి 12 గంటలకు ఈ టీజర్ అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం భగవంత్ కేసరి కి రీమేక్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ టీజర్ మాత్రం ఓజీ స్టైల్ లో కట్ చేసినట్టుగా అనిపించింది. టీజర్ ఆరంభం లో హీరో అడుగుపెట్టే సన్నివేశం కానీ, చేతిలో రక్తం తో నిండిన కత్తి పట్టుకోవడం కానీ , ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఓజీ గ్లింప్స్ వీడియో గుర్తుకు రావడం సహజం. ఇక టీజర్ చివర్లో కత్తి తో మీసాన్ని మెలేసే షాట్ ని చూస్తే మనకే రవితేజ అప్ కింగ్ మూవీ ‘మాస్ జాతర’ టీజర్ గుర్తుకొస్తుంది.
ఈ టీజర్ లో కూడా ఒక షాట్ లో రవితేజ కత్తి తో మీసాన్ని మెలేస్తాడు. సినిమాని ఎలాగో రీమేక్ చేస్తున్నారు, ఇప్పుడు టీజర్ ని కూడా ఇన్ని సినిమాల నుండి రిఫరెన్స్ తీసుకొని రీమేక్ చెయ్యాలా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే ఈ టీజర్ కి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బిలో యావరేజ్ లాగా అనిపించింది. అనిరుద్ విజయ్ సినిమాకు ఇంత పేలవంతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. గతంలో విజయ్ కి ఆయన ఎలాంటి మ్యూజికల్ చార్ట్ బస్టర్స్ ని అందించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సగం ఆయన సినిమాలు ఈమధ్య కాలం లో అలా ఆడుతున్నాయంటే అందుకు అనిరుద్ మ్యూజిక్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. విజయ్ కి ఇదే చివరి సినిమా అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలపై ద్రుష్టి పెట్టనున్నారు.