Jana Nayagan Movie Leak Controversy: మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని సార్లు రాజకీయాలను చూసినప్పుడు, మన నాయకులూ ఏంటి , ఇంత దారుణంగా తయారయ్యారు, పాలిటిక్స్ చాలా దరిద్రంగా తయారు అయ్యాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ తమిళనాడు పాలిటిక్స్ ని చూస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లోని పాలిటిక్స్ చాలా బెటర్ అని అర్థం అవుతోంది. ముఖ్యంగా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎంతలా టార్గెట్ చేస్తారో పవన్ కళ్యాణ్ విషయం లో మనం గడిచిన ఆరేళ్లలో చూశాము . కానీ తమిళనాడు లో TVK పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ని అయితే పవన్ కళ్యాణ్ ని మించి టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ కనీసం పవన్ కళ్యాణ్ సినిమాలను విడుదల చేయనిచ్చేవారు , కానీ అక్కడ సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇవ్వనివ్వకుండా, విడుదలను ఆపేసారు. అక్కడితో ఆగలేదు , ఆయన సినిమాని ఆన్లైన్ లో లీక్ కూడా చేసేశారు.
విజయ్ హీరో గా నటించిన ‘జన నాయగన్’ చిత్రం సోషల్ మీడియాలో లీకై , ఆ సినిమాలోని సన్నివేశాలకు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. అధికారం లో ఉన్న DMK పార్టీ మద్దతుదారులు చెప్పేది ఏమిటంటే , విజయ్ కావాలనే ఈ చిత్రాన్ని తన మనుషుల చేత లీక్ చేయించాడు , ఎందుకంటే కొద్దిరోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ సినిమాలో అనేక సన్నివేశాలు రాజకీయాలను ఉద్దేశించి తెరకెక్కిచారు కాబట్టి , కచ్చితంగా అవి జనాల్లోకి వెళ్తే , పార్టీ కి కాస్త మైలేజ్ వస్తుందనే ఉద్దేశ్యంతోనే, స్వయంగా ఆయన ఈ సినిమాని తన మనుషులతో లీక్ చేయించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్ చెప్పేది ఏమిటంటే , ఇది DMK పార్టీ నేతల పని అని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు , ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాని లీక్ చేయించాడని అంటున్నారు.
అయితే దీనిపై సీఎం స్టాలిన్ స్పందించిన తీరుని చూస్తే ఎలాంటి వారికైనా వీళ్ళే లీక్ చేయించారా అనే అనుమానం కలుగుతోంది. ఒక రిపోర్టర్ స్టాలిన్ ని ప్రశ్న అడుగుతూ ‘సార్ , జన నాయగన్ చిత్రం విడుదలకు ముందే లీక్ అయ్యింది. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? ‘ అని అడగ్గా, అందుకు స్టాలిన్ సమాధానం చెప్తూ ‘అలాంటి విషయాల పై ఫోకస్ చేసేంత ఖాళీగా లేను’ అంటూ చెప్పుకొచ్చాడు. రిపోర్టర్ మరో ప్రశ్న అడుగుతూ ‘ఈ సినిమాని మీ కొడుకు ఉదయ్ నిధి స్టాలిన్ లీక్ చేయించాడని ఒక ప్రముఖ మీడియా పత్రిక అంటోంది, మరి దీనికి మీ సమాధానం ఏంటి ? ‘ అని అడగ్గా , అందుకు స్టాలిన్ ‘అవునా..ఏమో నాకు తెలియదు , నేను ఆ వార్తలు అనుసరించను’ అంటూ చెప్పుకొచ్చాడు. పైరసీ చేయడం చట్టరీత్యా నేరం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ చర్యలు తీసుకోకపోగా, పైగా నేను ఇలాంటివి పట్టించుకోను అని కామెంట్ చేయడం వంటివి చూస్తుంటే , సీఎం స్టాలిన్ కి విజయ్ మీద ఎంత పగ ఉందో అర్థం అవుతుందని అంటున్నారు నెటిజెన్స్.