Cockroach Janata Party Funding : కావలసినంత ఆహారం వచ్చింది. డ్రై ఫ్రూట్స్ ఊహించని విధంగా వచ్చాయి. మెడికల్ కిట్లు.. ఫాస్ట్ ఫుడ్.. డ్రింక్స్.. టెంట్లు.. రాళ్లు.. రప్పలు.. ఇవన్నీ ఆకాశరామన్న పంపించినట్టు పరుగులు పెట్టుకుంటూ వచ్చాయి. అసలు ఇవన్నీ ఎవరిచ్చారు.. ఎక్కడి నుంచి వచ్చాయి.. ఇంత ఖర్చు ఎవరు భరించారు.. అసలు ఆ పార్టీకి ఒక రూపం అంటూ లేదు. కనీసం క్షేత్రస్థాయిలో నిర్మాణం లేదు. కార్యకర్తలు లేరు. కేవలం సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారం ద్వారానే ఇంతటి ఉద్యమం పుట్టింది. మరి ఈ ఉద్యమం వెనుక ఉన్నది ఎవరు.. ఇప్పుడు ఈ విషయాలను బయట పెట్టే పనిలో పడ్డారు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు.
కాక్రోచ్ జనతా పార్టీ లో అధికార ప్రతినిధిగా సౌరవ్ దాస్ కొనసాగుతున్నారు. ఈయనకు సంబంధించి బ్యాంక్ ఖాతా వివరాలను దర్యాప్తు సంస్థల అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి దిమ్మ తిరిగిపోయే నిజాలు తెలిసిపోయాయి. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారంలో అసలు కోణం వేరే ఉందని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు.. జాతీయ వాదులు అనుమానించినట్టుగానే.. దీని వెనక పెద్ద వ్యవహారం సాగిందని.. విదేశీ శక్తులు ఉన్నాయని ఇప్పుడు తెలుస్తోంది.
సౌరవ్ దాస్ ఖాతాలో కొన్ని సంవత్సరాలుగా లక్షల డాలర్లు జమవుతున్నాయి. ఆమధ్య ఆయనకు 30 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చిందని సమాచారం. అయితే ఆ డబ్బులు ఆయన ఖాతాలో పడలేదని తెలుస్తోంది. 16 మిలియన్ డాలర్లను నార్వేజియన్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ నో రాడ్ అనే సంస్థ ఇచ్చినట్టు సమాచారం. 2.4 మిలియన్ డాలర్లను లీడ్స్ ఫౌండేషన్ ఇచ్చినట్టు సమాచారం. తొమ్మిది లక్షల డాలర్లను ఓపెన్ సొసైటీ అనే సంస్థ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ స్థాయిలో డాలర్ల సొమ్ము రావడంతోనే ఉద్యమాన్ని ఈ స్థాయిలో నిర్వహించగలిగారని జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. పైగా ఆయనకు 30 మిలియన్ డాలర్లు ఇస్తామని ఒక సంస్థ ఈమెయిల్ ద్వారా సమాచారం పంపించడం దర్యాప్తు సంస్థల అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తులు.. ఇక్కడ ఉద్యమాలకు డబ్బు ఇవ్వడం ఏంటనేది అర్థం కావడం. మరోవైపు బొద్దింకలు ఆందోళనలు చేస్తున్నప్పుడు కెనడా వేదికగా కార్యాలపాలు సాగించే ఖలిస్థాన్ వేర్పాటు వాదులు తెర ముందుకు వచ్చారు. ఇండియాలో ఇదే స్థాయిలో ఆందోళనలు చేస్తే భారీగా డబ్బులు ఇస్తామని ప్రకటించారు. దీనినిబట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని అర్థమవుతోంది.
కేవలం డబ్బులు మాత్రమే కాకుండా ఆందోళనలు జరుగుతున్నప్పుడు అక్కడి యువత కోసం భారీగా ఆహారం వచ్చింది. దుస్తులు కూడా వచ్చాయి. ఇక రాళ్లు.. మెడికల్ కిట్లు.. డబ్బుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇదంతా కూడా విదేశీ శక్తుల కుట్ర అని.. వారి మాయలో పడి మన విద్యార్థులు నాశనం కాకుండా ఉండడానికే ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త పడిందని.. విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించిందని జాతీయ వాదులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రోజుల్లో ఈ విచారణ మరింత వేగవంతంగా సాగితే అసలు నిజాలు బయటికి వస్తాయని.. అప్పుడు ముసుగు వీరులు.. కుట్ర వీరులు.. విదేశీ శక్తుల చేతిలో తొత్తులుగా మారిన వారు బయటపడతారని జాతీయవాదులు చెబుతున్నారు.

