James Bond: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టెక్నాలజీ అనేది బీభత్సంగా పెరిగిపోతుంది. ఒకప్పుడు సినిమాను రీల్ లో తీసేవారు ఆ తర్వాత డిజిటల్ అవడం వల్ల సినిమా తీయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇక ఇప్పుడు రకరకాల టెక్నాలజీని వాడుతూ అప్డేటెడ్ వర్షన్స్ తో సినిమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే జెమ్స్ బాండ్ 26వ చిత్రంగా ఒక సినిమా రాబోతుంది అంటూ ట్రైలర్ కూడా యూట్యూబ్ లో సందడి చేస్తోంది.
అయితే ప్రస్తుతం సినిమాని ఏఐ టెక్నాలజీ వాడుకొని తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టెక్నాలజీని వాడుకోవడం వల్ల సినిమా ప్రొడక్షన్ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇక అలాగే కొన్ని లేని క్యారెక్టర్స్ ని కూడా సృష్టించవచ్చు. ఇక ఇప్పటివరకు ఈ టెక్నాలజీని మ్యూజిక్ డైరెక్టర్లు,డైరెక్టర్లు మాత్రమే ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు సినిమా కోసం ఈ టెక్నాలజీని వాడడం వల్ల ఇది మరింత రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకునే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ముందున్న రోజుల్లో ప్రొడక్షన్ ఖర్చు చాలా వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా కొంతమంది అయితే చాలా లో బడ్జెట్లో కూడా సినిమాలు చేసుకునే అవకాశాలను అయితే కల్పిస్తుంది. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కూడా సినిమాల క్వాలిటీ అనేది కూడా పెరగాలి. అలాంటప్పుడే ఒక సినిమా ప్రేక్షకుడికి రీచ్ అవుతుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా టెక్నాలజీ ని జేమ్స్ బాండ్ సినిమాని సూపర్ సక్సెస్ చేయాలని మేకర్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ టెక్నాలజీ అనేది ఎంత వరకు ప్రేక్షకుడి మెప్పిస్తుందనేది. ఇక ఇప్పటికే కొన్ని సినిమాల్లో ఈ టెక్నాలజీని వాడుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం వాడలేదు.
ఇక ఈ మ్యూజిక్ డైరక్టర్లు దీని సహాయం తో ప్రజెంట్ లేని మనుషుల చేత కూడా సినిమా పాటలు పాడిస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని దాని పూర్తి పని తీరు తెలుస్తుంది. అలాగే దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ప్రస్తుతం ఉన్న మేకర్స్ కి తెలుస్తోంది…