Jalsa Vs Murari: రీ రిలీజ్ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Super Star Mahesh Babu) సినిమాలు టాప్ లో ఉన్నాయి అనేది కాదు అనలేని నిజం. టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ, వీళ్లిద్దరి పాత సినిమాల రీ రిలీజ్ లకు మాత్రమే బంపర్ రెస్పాన్స్ వచ్చాయి. ఎందుకంటే అభిమానులకు మరియు ఆడియన్స్ కి నిజమైన క్లాసిక్ సినిమాలను అందించిన హీరోలు నేటి జనరేషన్ లో వీళ్లిద్దరు మాత్రమే. వీళ్ళ రీ రిలీజ్ సినిమాలు విడి విడిగా వస్తేనే థియేటర్స్ హోరెత్తిపోతుంటాయి, అలాంటిది ఒకే రోజు విడుదలైతే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో డిసెంబర్ 31 అందుకు వేదికగా నిల్చింది. మహేష్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ చిత్రం గా నిల్చిన ‘మురారి ‘(#Murari4K), పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘జల్సా'(#Jalsa4K) చిత్రాలు అదే రోజున విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల్లో ‘జల్సా’ ఎవ్వరూ ఊహించని రేంజ్ మార్జిన్ తో ఆధిపత్యం చూపిస్తూ ‘మురారి’ ని ఓడించింది.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే జల్సా చిత్రానికి మొదటి రోజు ఇండియా వైడ్ గా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో నైజాం ప్రాంతం నుండి 50 లక్షల గ్రాస్ వసూళ్లు రాగా, సీడెడ్ + కోస్తాంధ్ర నుండి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా కేవలం ఇండియా వైడ్ గా వేసిన 180 షోస్ నుండి మాత్రమే వచ్చింది. ఈ రేంజ్ ర్యాంపేజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఊహించలేదు. ఒకే ఏడాది లో హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలకు బాగా డబ్బు ఖర్చు చేసారు కదా , జల్సా రీ రిలీజ్ ని తేలికగా తీసుకుంటారేమో అని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించనంత రేంజ్ లో ఈ చిత్రం గ్రాస్ వసూళ్లను రాబట్టే సరికి అందరూ షాక్ కి గురయ్యారు.
మొదటి రీ రిలీజ్ లో ఈ చిత్రానికి 3 కోట్ల 23 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు రెండవ రీ రిలీజ్ కోటి రూపాయలతో కలిపితే 4 కోట్ల 23 లక్షలు అవుతుంది. ఇక మురారి విషయానికి వస్తే ఈ చిత్రానికి ఈ రీ రిలీజ్ లో కేవలం 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇంత తక్కువ వసూళ్లు వస్తాయని మహేష్ ఫ్యాన్స్ అసలు ఊహించలేదు. ఎందుకంటే ఈ చిత్రం మొదటి రీ రిలీజ్ లో 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ రేంజ్ గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమాకు రెండవ రీ రిలీజ్ లో ఇంత తక్కువ గ్రాస్ రావడమేంటో అర్థం కావడం లేదంటూ అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా న్యూ ఇయర్ రేస్ లో జల్సా చిత్రం దాదాపుగా ట్రిపుల్ మార్జిన్ తో మురారి పై విజయం సాధించింది.