https://oktelugu.com/

Pawan Kalyan Jalsa Special Shows: పదిహేను రోజుల ముందే రికార్డ్స్ బద్దలు కొట్టిన జల్సా స్పెషల్ షోస్..ఇది మాములు క్రేజ్ కాదు

Pawan Kalyan Jalsa Special Shows: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన జల్సా సినిమా సెప్టెంబర్ 2 వ తేదీన ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో రీ రిలీజ్ అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దాదాపుగా 500 కి పైగా షోస్ ప్లాన్ చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి..మొన్నీమధ్యనే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమా కి సుమారు 350 కి పైగా షోస్ వేశారు..అన్ని రికార్డు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2022 / 05:05 PM IST

    Pawan Kalyan Jalsa Special Shows

    Follow us on

    Pawan Kalyan Jalsa Special Shows: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన జల్సా సినిమా సెప్టెంబర్ 2 వ తేదీన ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో రీ రిలీజ్ అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దాదాపుగా 500 కి పైగా షోస్ ప్లాన్ చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి..మొన్నీమధ్యనే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమా కి సుమారు 350 కి పైగా షోస్ వేశారు..అన్ని రికార్డు స్థాయి ఫుల్స్ తో 1 కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం రికార్డు గా నిలిచింది..ఇప్పుడు ఈ రికార్డు ని అతి తేలికగా బ్రేక్ చేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్..దానికి తగట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా కనివిని ఎరుగని రేంజ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు..కేవలం ఓవర్సీస్ లో వచ్చే గ్రాస్ తోనే పోకిరి వరల్డ్ వైడ్ స్పెషల్ షోస్ గ్రాస్ ని బ్రేక్ చేస్తామని సవాలు విసిరారు పవన్ కళ్యాణ్ ఫాన్స్.

    Pawan Kalyan

    వాళ్ళు చేసిన ఛాలెంజ్ కి తగట్టే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఆస్ట్రేలియా లో ప్రారంభించేసారు..అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన అతి తక్కువ సమయం లోనే ఈ సినిమాకి 5 వేల ఆస్ట్రేలియన్ డాలర్స్ వచ్చాయట..అది కూడా కేవలం ఒక్క థియేటర్ నుండే రావడం విశేషం..మెల్బోర్నే లో 360 సీటింగ్ కెపాసిటీ ఉన్న V మాక్స్ థియేటర్ లో జల్సా సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు..ఇక్కడ ఒక్కో టికెట్ ఆన్లైన్ లో 28 డాలర్లకు విక్రయిస్తున్నారు థియేటర్ యాజమాన్యం..ఆ విధంగా ఈ సినిమా ఈ థియేటర్ నుండి 5 వేల డాలర్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది.

    Also Read: Varun Tej with the Heroine: వరుణ్ తేజ్ నాటీ.. ఆ హీరోయిన్ తో ఇలా సీక్రెట్ గా దొరికేశాడు..!

    Pawan Kalyan

    మహేష్ పోకిరి స్పెషల్ షోస్ ఆస్ట్రేలియా మొత్తం కలిపి 3 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి..కానీ జల్సా సినిమా కేవలం ఒక్క థియేటర్ నుండి భారీ మార్జిన్ తో పోకిరి రికార్డు ని లేపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..ఆస్ట్రేలియా మొత్తం మీద 10 స్పెషల్ షోలు పడే అవకాశం ఉందట జల్సా సినిమాకు..పోకిరి స్పెషల్ షోస్ ఓవర్సీస్ మొత్తం కలిపి 20 వేల డాలర్లు వసూలు చేస్తే జల్సా సినిమా లక్ష డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..చూడాలిమరి ఈ సినిమా ఆ రేంజ్ లో వసూలు చేస్తుందో లేదో అనేది.

    Also Read:Liger Censor Report: లైగర్ సినిమా సెన్సార్ టాక్ అదిరిపోయింది..సినిమాలో హైలైట్స్ ఇవేనట

     

    Tags