Jalsa re-release bookings: ఈ ఏడాది టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాస్ ఫిల్మ్ ‘ఓజీ'(They Call Him OG) రూపం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ చేతుల్లోనే ఉంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి ని తీర్చిన చిత్రమిది. ఇప్పటికీ ఈ సినిమా మత్తు నుండి అభిమానులు బయటకు రాలేదు. అయితే ఈ ఏడాది ఫినిషింగ్ టచ్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘జల్సా'(#Jalsa4k) రీ రిలీజ్ తో గ్రాండ్ గా ఇవ్వనున్నారు. నిన్న రాత్రి ఈ చిత్రానికి సంబంధించిన హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. ఈ అప్డేట్ తెలియగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిమిషాల వ్యవధి లో హైదరాబాద్ లో పది కి పైగా షోస్ హౌస్ ఫుల్స్ నమోదు చేశారు. ఈ చిత్రం తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ కూడా రేపే రీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా బుకింగ్స్ జల్సా కి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.
ప్రస్తుతానికి జల్సా చిత్రం ఆల్ ఇండియా వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. షోస్ ఇంకా షెడ్యూల్ చేస్తూనే ఉన్నారు, అభిమానులు హౌస్ ఫుల్స్ పెడుతూనే ఉన్నారు. ఇక బుక్ మై షో లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 13.28 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. క్రిస్మస్ కానుకగా విడుదలైన కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. శంబాలా చిత్రానికి గడిచిన 24 గంటల్లో 9.34 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, ఛాంపియన్ చిత్రానికి 5.93 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఈషా చిత్రం అయితే బుక్ మై షో ట్రెండింగ్ నుండి వెళ్ళిపోయింది. ఓవరాల్ గా జల్సా మూవీ డామినేషన్ మామూలు రేంజ్ లో లేదు అనే చెప్పాలి. ఇక రేపు జల్సా తో పాటు విడుదల అవుతున్న మురారి చిత్రానికి కేవలం 6 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా చిత్రాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎదో రీ రిలీజ్ కదా, క్యాజువల్ గా ఒకసారి చూద్దాం అనే మూడ్ లోనే ఉన్నారు. వాళ్ళు ప్రెస్టీజియస్ గా తీసుకొని, ఈ సినిమాని నెత్తిన పెట్టుకొని ఉండుంటే, కచ్చితంగా గబ్బర్ సింగ్ మొదటి రోజు రికార్డుని బద్దలు కొట్టి ఉండేదని అంటున్నారు. ఒకపక్క మురారి చిత్రానికి ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ ఇస్తుంటే, జల్సా చిత్రానికి నూన్ మరియు మ్యాట్నీ షోస్ మాత్రమే దొరుకుతున్నాయి. న్యూ ఇయర్ ముందు రోజున సాయంత్రం షోస్ కి మంచి డిమాండ్ ఉంటుంది. నూన్ మరియు మ్యాట్నీ షోస్ బాగా వీక్ గా ఉంటాయి. కానీ జల్సా చిత్రానికి ఆ తేడా కనిపించడం లేదు. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్స్ తో ముందుకు దూసుకుపోతోంది. మరి ఈ చిత్రం ఈ రిలీజ్ లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.