Jailer Vs Gadar 2: ఈ హాలీడే వీకెండ్ లో దున్నేస్తున్న జైలర్, గదర్ 2.. థియేటర్ అక్యూపెన్సీ రిపోర్ట్ ఇదీ

చిరంజీవి నటించిన భోళా శంకర్ మాత్రం డివైడ్ టాక్ రావడంతో రోజురోజుకీ ఆకుపెన్సి దారుణంగా తగ్గిపోతూ వచ్చింది. ఎన్నో బోళా శంకర్ థియేటర్స్ ని కూడా జైలర్ ని రీప్లేస్ చేస్తున్నారు. మరో పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో జైలర్ ప్రభంజనం ఉంటుందని భావిస్తున్నారు.

Written By: Swathi, Updated On : ఆగస్ట్ 17, 2023 1:31 సా.

Jailer Vs Gadar 2

Follow us on

Jailer Vs Gadar 2: గత వారం థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. మూడు ఇండస్ట్రీలకు చెందిన నాలుగు సూపర్ స్టార్ల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు మన సౌత్ ఇండియా నుంచి రాగ మరో రెండు నార్త్ ఇండియా నుంచి వచ్చాయి. ఇక మన సౌత్ ఇండియా నుంచి వచ్చిన సినిమాలు తీసుకుంటే ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ అయితే మరొక సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన బోళా శంకర్.

ఇందులో రజినీకాంత్ చేయవలసిన బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉండగా చిరంజీవి భోళా శంకర్ చిత్రం మాత్రం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది.
నెల్సన్ పక్షకత్వంలో వచ్చిన జైలర్ సినిమా కమర్షియల్ కథ అయిన రజినీకాంత్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఇందులోపుష్కలంగా ఉన్నాయి. దీంతో తమిళనాడు స్థాయిలోనే తెలుగు రాష్ట్రాలలో కూడా సినీ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది.

చిరంజీవి నటించిన భోళా శంకర్ మాత్రం డివైడ్ టాక్ రావడంతో రోజురోజుకీ ఆకుపెన్సి దారుణంగా తగ్గిపోతూ వచ్చింది. ఎన్నో బోళా శంకర్ థియేటర్స్ ని కూడా జైలర్ ని రీప్లేస్ చేస్తున్నారు. మరో పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో జైలర్ ప్రభంజనం ఉంటుందని భావిస్తున్నారు.

మరోపక్క హిందీ సినిమాల విషయానికి వస్తే సన్నీ డియోల్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ ‘గదర్ 2’ ఆగస్టు 11 థియేటర్లలో విడుదలైంది. 2001లో వచ్చిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కహానీ’ చిత్రానికి సీక్వెల్‍గా ‘గదర్ 2’ రిలీజైంది. 2023లో పఠాన్ తర్వాత తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది ఈ చిత్రం. ఇక ఈ సినిమాతో కాదు రిలీజ్ అయిన మరో హిందీ సినిమా అక్షయ్ కుమార్ ‘ఓఎంజీ 2’ కూడా ఆగస్టు 11 రిలీజ్ అయింది. మరీ ‘గదర్ 2’ తో సినిమా అంతా కలెక్షన్స్ రాకపోయినా ఈ సినిమా కూడా కలెక్షన్స్ బాగానే సాధించింది.

ఇక ఈ నాలుగు సినిమాలలో, జైలర్, గదర్ 2 హైదరాబాద్ నైట్ షోలలో కూడా త్వరగా హౌస్ఫుల్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. లాంగ్ వీకెండ్ అయ్యాక ఆగస్టు 16న కూడా నైట్ షోలు ఈ నాలుగు చిత్రాలలో మూడు చిత్రాలకు హౌస్ఫుల్ కావడం అందరిని ఆశ్చర్య కలిగిస్తుంది. అయితే భోళా శంకర్ సినిమా హైదరాబాద్ లో 80 నైట్ షోలకు గాను ఒక్క షో కూడా హౌస్ ఫుల్ కాకపోవడం తెలుగు ప్రేక్షకులను నిరాశ పరుస్తోంది. అన్నిటికన్నా ముందు ప్లేస్ లో జైలర్ సినిమా హైదరాబాదులో 146 నైట్ షోలకు గాను 80 నైట్ షోలు ఫుల్ అయ్యి దూసుకుపోతోంది.

మరోపక్క గదర్ 2 సినిమాకి 80 నైట్ షోలకు గాను 50 నైట్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక ఓ మై గాడ్ టు సినిమాకి 54 నైట్ షోలకు గాను 25 షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.