Jailer Dialogue: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినీ ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టిస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లు రావడంతో రజనీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘తలైవా ఈజ్ బ్యాక్’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ తరుణంలో చాలా రోజుల తరువాత రజనీ ఇండస్ట్రీని షేక్ చేసే రోజులు వచ్చాయని సినీ ఫీల్డుకు చెందని కొందరు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా ఓ సినీ డైరెక్టర్ ‘జైలర్’ సినిమాలో లోని ఓ డైలాగ్ గురించి ఆసక్తికర కామెంట్ చేశాడు. ఈ డైలాగ్ రజనీ రియల్ లైఫ్ లోని దంటూ చెప్పడంతో దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి? దీనిపై ఎందుకంత చర్చ సాగుతోంది?
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ‘జైలర్’ ఆగస్టు 10న థియేటర్లోకి వచ్చింది. మొదట్లో సినిమాలపై అంచనాలు లేకున్నా ఆ తరువాత సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో ఆడియన్స్ థియేటర్లకు పరుగులు పెట్టడం ప్రారంభించారు. దీంతో 20 రోజులకు పైగా గడిచినా కలెక్సన్ల జోరు కొనసాగిస్తోది. రూ.210 కోట్లు పెట్టిన ఈ సినిమాకు ఇప్పటికే రెట్టింపు కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే రజనీ యాక్షన్ తో పాటు స్టోరీ కూడా బాగుండడంతో సినిమాకు జనాలు క్యూ కడుతున్నారు.
ఈ తరుణంలో సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. రజనీ ఇందులో తాతగా కూడా నటించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సినిమాలో ఓ డైలాగ్ అందరినీ ఆకర్షించింది. రజనీ కాంత్ తన కొడుకుతో ‘ఏదైనా చెప్పాలా నాన్న’ అనే డైలాగ్ ఉంటుంది. దీనిని రజనీ పదే పదే ప్రస్తావించాడు. అయితే ఈ డైలాగ్ రజనీకాంత్ రియల్ జీవితంలోనిది అని ప్రముఖ డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య-ధనుష్ లు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఐశ్వర్య విడాకులు తీసుకునే ముందు తన కూతురును ‘ఏదైనా చెప్పాలా నాన్న’ అని సినిమాలో లాగే అడిగారని అన్నారు. దీంతో ఈ టాపిక్ పై సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. రజనీకాంత్ రియల్ లైఫ్ పై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఈ సమయంలో ఈ డైలాగ్ పై ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.