Sambasivarao Trolling: పిచ్చి ముదిరింది..తలకు రోకలి చుట్టండి అన్నాడట వెనకటికి ఒకడు. ప్రస్తుతం ఆ జర్నలిస్టు పరిస్థితి కూడా అలానే ఉంది. జర్నలిజంతో ఏళ్ల అనుభవం ఉన్న ఆయన.. ఎల్లో మీడియాలో చేరి తన అనుభవాన్ని మొత్తం పాతాళంలో పడేశారు. భావితరాల జర్నలిస్టులకు ఆదర్శంగా ఉండవలసిన ఆయన పూర్తిగా గాడి తప్పారు. జనం ఏమనుకుంటున్నారు అనే సోయి లేకుండా నోటికి ఏది వస్తే అది పలుకుతూ అభాసుపాలవుతున్నారు. ఆయన నిర్వాకం చూసిన ప్రేక్షకులు పాపం అని జాలి పడుతున్నారు. ఇంతకీ ఆయన చేసింది ఏంటో మీరూ చదివేయండి.
సాంబశివరావు..టీవీ5 చానెల్ లో ఒక సీనియర్ జర్నలిస్టు. వార్తలను వార్తలు లాగా ఒకప్పుడు ప్రజెంట్ చేసేవాడు. మీడియా సర్కిల్లో కూడా ఈయనకు మంచి పేరు ఉండేది. కానీ ఎప్పుడైతే టీవీ 5 లో చేరాడో.. అప్పుడే అతడు పూర్తిగా లైన్ తప్పాడు. చెప్పే ప్రతి వార్తను కూడా పచ్చ కోణంలోనే ప్రజెంట్ చేయడం ప్రారంభించాడు. ఫలితంగా న్యూట్రాలిటీ ముద్రను చెరిపి వేసుకొని “ఎల్లో” లిటీ అనే బిరుదును తగిలించుకున్నాడు. స్థూలంగా చూస్తే పచ్చ కండువా వేసుకోని పసుపు కార్యకర్త అయిపోయాడు.. వార్త ఏదైనా కూడా అందులో పచ్చ కోణాన్ని ప్రతిబింబించడం మొదలుపెట్టాడు. ఇది ఆ ఛానల్ యాజమాన్యానికి నచ్చుతుందేమో గాని.. చూసేవారికి చాలా ఎబ్బెట్టుగా ఉంటున్నది.
నిజానికి సాంబశివరావు మీద ఈ స్థాయిలో జనాలకు ఆగ్రహం రావడానికి కారణం.. చంద్రయాన్ ప్రయోగాన్ని చంద్రబాబు ఖాతాలో తోసేయడమే.. అయితే ప్రస్తుతం ఆ ప్రయోగం విజయవంతమైనది కాబట్టి.. ఆ ప్రయోగం పేరులో చంద్ర అని ఉంది కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని సాంబశివరావు జోస్యం చెబుతున్నాడు. ఇంకా నయం చంద్రయాన్ ప్రయోగం చేసింది మొత్తం చంద్రబాబు అనలేదు. నాడు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం కట్టించింది కూడా చంద్రబాబు అని చెప్పలేదు. ఏ మాటకు ఆ మాట.. చంద్రయాన్ విజయవంతం తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని సాంబశివరావు చెప్పడంలో ఏ మాత్రం భయంగాని, బెరుకు గాని ప్రదర్శించలేదు. పైగా దానికి సార్ అంటూ సంబోధిస్తూ చెప్పుకొచ్చాడు. ఓ ఏబిఎన్, టీవీ5, ఈటీవీ, మహా టీవీ.. వీటన్నింటిలో పనిచేసే పాత్రికేయులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు అనుకుంటా. లేకుంటే ఈ స్థాయిలో పచ్చ దండకం చేయాలంటే మాటలు కాదు. అన్నట్టు సాంబశివరావు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చంద్రయాన్ సక్సెస్ అయింది ఇంక ఏపీలో గెలిచేది చంద్రన్న అంట
రంగంలోకి దిగిన ఎల్లో మీడియా pic.twitter.com/CziXtZYkFd
— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) August 23, 2023