Jailer 2 Hrithik Roshan: సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ చిత్రం ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. హిందీ వెర్షన్ లో పెద్దగా వసూళ్లు రాలేదు కానీ , అక్కడ కూడా క్లిక్ అయ్యుంటే , కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఉండేది ఈ చిత్రం. అలాంటి క్రేజీ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ఉంటుంది అని డైరెక్టర్ చెప్పినప్పుడే ప్రేక్షకుల్లో , అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్ కి వెళ్లాయి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది. అయితే ఈ చిత్రం లో ఒక స్పెషల్ క్యామియో రోల్ కోసం ఇండియా లో ఎంతమంది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని సంప్రదించారు అనే విషయం అందరికీ తెలిసిందే.
ముందుగా బాలయ్య బాబు ని అడిగారు, మొదట్లో కచ్చితంగా చేస్తాడనే రూమర్ వచ్చింది కానీ , చివరికి ఆయన నిరాకరించినట్టే చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ని సంప్రదించారు , ఆయన డేట్స్ కూడా ఖాళీ లేకపోవడం తో కుదర్లేదు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని కూడా సంప్రదించారు , కానీ ఆరోగ్య సమస్య దృష్ట్యా ఆయన కూడా ఒప్పుకోలేదు. ఇక చివరికి ఈ పాత్రని హృతిక్ రోషన్ చేస్తున్నాడు. గత పది రోజులుగా ఆయనపై కొన్ని సోలో సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక రజినీకాంత్ కాంబినేషన్ లో ఒక షాట్ కి సంబంధించిన చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందట. త్వరలోనే అది కూడా పూర్తి చేయబోతున్నట్టు సమాచారం. ‘కూలీ’ చిత్రం లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించగా, ‘జైలర్ 2’ లో మరో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కూడా అదే తరహా గెస్ట్ రోల్ లో కనిపించడం గమనార్హం. కానీ కూలీ లో అమీర్ ఖాన్ రోల్ క్లిక్ అవ్వలేదు , విమర్శలు వచ్చాయి , మరి ‘జైలర్ 2’ లో హృతిక్ రోల్ ని అయినా సరిగా చూపిస్తారో లేదో చూడాలి.
