Comedian Jai Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే సాయి మార్తాండ్ దర్శకత్వంలో వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…రెండున్నర కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినప్పటికి ఇప్పటివరకు 25 కోట్లకు పైన కలెక్షన్స్ అయితే వసూలు చేసింది అంటే మామూలు విషయం కాదు. ఇక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన మౌళి సినిమాలో హీరోగా నటించాడు. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించడంతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిందనే చెప్పాలి.ఈ సినిమాతో ప్రేక్షకులందరు ఒక హై ఫీల్ అయితే పొందుతున్నారు. మంచి సినిమాలు వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఈ సినిమాని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు… ఇలా ఉంటే ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త కమెడియన్ దొరికాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లయితే వైరల్ అవుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా జై కృష్ణ అనే కమెడియన్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని సైతం ఒక సూపర్ కామెడీ సినిమాగా రాణించబోతున్నాను అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా మంచి కాన్సెప్ట్ లతో వచ్చిన సినిమాలకు మాత్రం చాలా మంచి గుర్తింపైతే లభిస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు…ఇక జై కృష్ణ పర్ఫామెన్స్ చూసిన చాలామంది అతని కోసమే ఆ సినిమాను చూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…
మరి ఇక మీదట ఆయన పేరు చాలా ఎక్కువగా వినిపించబోతుందంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి… మరి ఇకమీదట ఆయన కూడా ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ కి పోటీ ఇస్తు ఇండస్ట్రీలో తన మనుగడను కొనసాగిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Uncle Character Peak Comedy #JaiKrishna #LittleHearts pic.twitter.com/dCoIN0bxGL
— (@urslvlyNR) September 16, 2025