spot_img
Homeఎంటర్టైన్మెంట్Jai Hanuman Movie Shooting Started: 'జై హనుమాన్' షూటింగ్ ప్రారంభం..ఒకే ఫ్రేమ్ లో రిషబ్...

Jai Hanuman Movie Shooting Started: ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రారంభం..ఒకే ఫ్రేమ్ లో రిషబ్ శెట్టి, తేజ సజ్జ..వీడియో వైరల్!

Jai Hanuman Movie Shooting Started: టాలీవుడ్ హిస్టరీ లో కొన్ని సినిమాలు సృష్టించే బాక్స్ ఆఫీస్ సునామీలను అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి సునామీలలో ఒకటి ‘హనుమాన్'(Hanuman Movie) చిత్రం. 2024 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, ఒక చిన్న సినిమాతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అనేదానికి నిదర్శనం గా మారింది. మొదట్లో ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ‘గుంటూరు కారం’ కి పోటీగా వస్తోంది, డైనోసర్ లాంటి ఆ కాంబినేషన్ సినిమాతో పోటీ పడడం అవసరమా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. కానీ ‘గుంటూరు కారం’ చిత్రం విడుదలైన రోజే, ఈ సినిమా కూడా విడుదలైంది. అతి తక్కువ థియేటర్స్ తో, అతి తక్కువ షోస్ తోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రస్థానం మొదలైంది.

అలా మొదలైన ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ ని అందుకోలేని స్టార్ హీరోలు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఇది ఏ రేంజ్ సెన్సేషన్ అనేది. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, దాని పేరు ‘జై హనుమాన్’ ని సినిమా ఎండింగ్ లోనే డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ‘కాంతారా’ ఫేమ్ రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామి గెటప్ లో ఎంతో అద్భుతంగా కనిపించాడు. అయితే నేడు ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు అంజనాద్రిలో జరిగింది. ఈ కార్యక్రమానికి రిషబ్ శెట్టి, తేజ సజ్జ లతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నాడు.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హిందూ దేవుళ్ళ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైగా 300 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాకు సీక్వెల్ ఇది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, పాన్ ఇండియా లెవెల్ లో మన టాలీవుడ్ నుండి మరో వెయ్యి కోట్ల సినిమా వచ్చినట్టే. అయితే ఈ సినిమాలో రిషబ్ శెట్టి తో పాటు, తేజ సజ్జ కూడా కనిపిస్తాడట. కానీ ఆయన పాత్ర నిడివి సినిమా మొత్తం ఉండదట. కేవలం కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అట. అదే విధంగా ఈ చిత్రం లో విలన్ గా రానా దగ్గుబాటి నటించబోతున్నట్టు సమాచారం. మరి శ్రీ రాముడిగా ఎవరు కనిపించబోతున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version