Jai Hanuman Movie: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరూ ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి హనుమాన్ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ఈ సినిమాకి చాలా మంచి ప్రశంసలు అయితే వచ్చాయి.
ఇక దాంతోపాటుగా పాన్ ఇండియా రేంజ్ లో 400 కోట్ల వరకు కలెక్షన్లను కూడా రాబట్టి ఈ సంవత్సరం వచ్చిన అన్ని సినిమాల్లో ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా గుర్తింపును సంపాదించుకుంది. దీనికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ సినిమాని 2025 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా ప్రశాంత్ వర్మ ఇప్పటికే అనౌన్స్ చేశాడు. అయితే జై హనుమాన్ సినిమాలో హనుమంతుడు మీదనే స్టోరీ నడుస్తుంది. కాబట్టి విభీషణుడు కూడా హనుమంతుడికి తోడుగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
నిజానికి సప్త చిరంజీవులు అంటే మరణం లేకుండా కాలం ఉన్నంత వరకు బతికి ఉండే వాళ్ళు అని అర్థం..అయితే వాళ్ళు ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… హనుమంతుడు, విభీషణుడు, వామనుడు, వేదవ్యాసుడు, పరుశురాముడు,కృప చార్యుడు, అశ్వద్ధామ…వీళ్ళందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నారు. కాబట్టి వీళ్ళందర్నీ కలుపుతూ జై హనుమాన్ సినిమా ఉండబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలీదు గానీ, నిజానికి కలియుగoలో చెడు పెరిగిపోయిన సమయంలో వీళ్ళందరూ కూడా కలియుగన్ని చక్కబెట్టే దానికి మళ్ళీ వస్తారని పురాణాల్లో ఉంది.
కాబట్టి వీరందరూ ఏకకాలంలో కలుస్తారేమో చూడాలి…ఇక మొత్తానికైతే ప్రశాంత్ వర్మ వీళ్ళందర్నీ కలుపుతూ ఈ సినిమాని ఒక కథగా మలుస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని నార్త్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు…