Jagapathi Babu Host: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే వాళ్ళ కెరియర్ ఎంతకాలం పాటు సాఫీగా సాగుతోంది అనేది ఎవరు చెప్పలేరు. స్టార్ హీరోల విషయాలను పక్కన పెడితే మిగతా హీరోలందరు ఒక సక్సెస్ వస్తే టాప్ లోకి వెళ్ళిపోతారు. మరొకసారి ఫెయిల్యూర్ వస్తే పాతాళానికి పడిపోతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే సినిమా ఇండస్ట్రీలో ఎవరి కెరియర్ ఎంతవరకు కొనసాగుతుందనేది ఎవరు చెప్పలేరు… క్రమంలోనే నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సైతం అటు సినిమాలు చేసుకుంటూనే హోస్ట్ గా చేస్తూ భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫాం అయిన ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా బాలయ్య టాప్ హోస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఇండియాలో ఏ షో క్రియేట్ చేయలేని పలు రికార్డులను ఈ షో క్రియేట్ చేసిందనే చెప్పా. మరి ఇలాంటి క్రమంలోనే జగపతిబాబు లాంటి నటుడు సైతం మొదట హీరోగా తన కెరియర్ ను స్టార్ట్ చేసినప్పటికి మొదట్లో మంచి సక్సెస్ లను సాధించాడు.
Also Read: రాజమౌళి దెబ్బకి మరోసారి టికెట్ రేట్లు పెరగబోతున్నాయా..?
ఆ తర్వాత సక్సెస్ లు లేకపోవడంతో హీరోగా తన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇక ఆ తర్వాత ఆయన లెజెండ్ సినిమాతో బాలయ్య బాబు ను ఢీకొడుతూ విలన్ పాత్ర ను పోషించాడు. అందులో చాలా మంచి పర్ఫామెన్స్ ని కనబరచడంతో అప్పటినుంచి ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షో తో హోస్ట్ గా పరిచయమయ్యాడు. మొదటి ఎపిసోడ్ లోనే నాగార్జునను ఇంటర్వ్యూ చేసిన ఆయన హోస్ట్ గా 100% సెట్ అవుతాడు అనే నమ్మకాన్ని అందరిలో కలిగించాడు. నిజానికి బాలయ్య బాబు తర్వాత హోస్ట్ గా మంచి పాపులారిటిని సంపాదించుకుంటున్నా హీరో కూడా జగపతి బాబే కావడం విశేషం…
మరి ఈ షో మొదటి ఎపిసోడ్ తోనే అందరిలో ఒక భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. మరి రాను రాను రోజుల్లో కూడా ఈ షో మరింత ముందుకు వెళుతుందని షో యాజమాన్యంతో పాటు ప్రేక్షకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా జగపతిబాబు టాప్ హోస్ట్ గా ముందుకు దూసుకెళ్లడం పక్క అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…