Bheemla Nayak Movie AP Govt: పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు కాబట్టే.. భీమ్లానాయక్ సినిమాపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. అదే ఈ సినిమాలో మరో హీరో నటించి ఉండి ఉంటే.. అంతా సజావుగా ఉండేది. అందుకే.. ఈ సినిమా విషయంలో అనేక పొరపాట్లు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి పవన్ పై జగన్ ప్రభుత్వం కక్ష్య సాధిస్తోందంటూ విజయనగరం జిల్లా కొత్తవలసలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు.
ముఖ్యంగా బెనిఫిట్ షోలు వేయొద్దని, టికెట్ల ధరలు తగ్గించాలంటూ థియేటర్ల యజమానులను వేధిస్తోందని మండిపడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. టికెట్ల రేట్లు పెంచకుండా చూడాల్సిన బాధ్యత తహసీల్దార్లకు అప్పగించడంతో వారు థియేటర్లను తనిఖీ చేస్తున్నారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధమే భీమ్లానాయక్ సినిమా.
Also Read: ‘భీమ్లా నాయక్’ కోసం విరాళాలు.. ఎవరి జేబుల కోసం ?
సినిమాలోనే కాదు, సమాజంలో కూడా ప్రస్తుతం పవన్ ఇలాంటి యుద్ధమే చేస్తున్నాడు. మరో పక్క సినిమాకి కలెక్షన్స్ రాకుండా ప్లాన్ చేసిన జగన్ సర్కారు.. తాజాగా పవన్ సినిమా బాగాలేదు అంటూ తమ కార్యకర్తల చేత నెగిటివ్ ప్రచారం చేయిస్తోంది. అయితే, పవన్ అభిమానులు ఆ నెగిటివ్ ప్రచారాలను నమ్మవద్దు అని సినిమా టీమ్ కోరుకుంటుంది.
సినిమా అద్భుతంగా ఉందట. ముఖ్యంగా పవన్ – రానా మధ్య పవర్‌ఫుల్ డైలాగ్స్, ఫైట్స్‌తో ఫస్టాఫ్ ఎండ్ అవుతుంది. సెకండాఫ్‌లో హై ఓల్టేజ్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్లు సినిమాను ఓ లెవెల్‌కు తీసుకెళ్లాయి. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే బాగుంది. పవన్, రానా నటవిశ్వరూపం చూడొచ్చు. తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అని టాక్ వచ్చింది. మొత్తమ్మీద ఈ చిత్రం మంచి విజయం సాధించింది అని అంటున్నారు.
వాస్తవానికి తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రజెంట్ పవన్ మేనియా మాత్రమే కనిపిస్తోంది. ఇప్పటికే థియేటర్స్ అన్నీ ‘భీమ్లా నాయక్’ కోసం బుక్ చేసి ఉంచారు. అందుకే, పవన్ మేనియాతో ఇంతకూ ముందు రికార్డ్స్ అన్నీ చెల్లాచెదురు అయిపోతున్నారు. పైగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యూఎస్ మార్కెట్ లోనూ.. ‘భీమ్లా నాయక్’ కలెక్షన్ల కేకలను భారీ స్థాయిలో పెట్టిస్తున్నాడు.