https://oktelugu.com/

RRR Hopes: ‘ఆర్ఆర్ఆర్’ ఆశలపై నీళ్లుచల్లిన జగన్ సర్కారు?

RRR Hopes: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నిన్నటి వరకు కరోనా కారణంగా థియేటర్లన్నీ మూసేవేసే పరిస్థితి వచ్చింది. దీంతో చిన్న సినిమాలు ఓటీటీలు రిలీజు చేసుకొని నిర్మాతు సేఫ్ అయ్యారు. అయితే పెద్ద సినిమాలకు మాత్రం ఓటీటీలు వర్కౌట్ కాలేదు. దీంతో థియేటర్ల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలోనే ఏపీ సర్కారు టికెట్ల రేట్లు తగ్గించడం ములిగే నక్కపై తాడిపండుపడ్డ చందంగా మారింది. కరోనా ఆంక్షల మధ్య ఎన్నో జాగ్రత్తలు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2021 / 03:30 PM IST
    Follow us on

    RRR Hopes: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నిన్నటి వరకు కరోనా కారణంగా థియేటర్లన్నీ మూసేవేసే పరిస్థితి వచ్చింది. దీంతో చిన్న సినిమాలు ఓటీటీలు రిలీజు చేసుకొని నిర్మాతు సేఫ్ అయ్యారు. అయితే పెద్ద సినిమాలకు మాత్రం ఓటీటీలు వర్కౌట్ కాలేదు. దీంతో థియేటర్ల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలోనే ఏపీ సర్కారు టికెట్ల రేట్లు తగ్గించడం ములిగే నక్కపై తాడిపండుపడ్డ చందంగా మారింది.

    RRR Team

    కరోనా ఆంక్షల మధ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దర్శక, నిర్మాతలు షూటింగులు చేయాల్సి వస్తోంది. దీంతో కాస్ట్ ప్రొడక్షన్ కూడా భారీగా పెరిగిపోతోంది. కరోనా సాకుతో నటీనటులు సైతం రెమ్యూనరేషన్ బాగా పెంచేసినట్లు తెలుస్తోది. దీంతో మునుపటి కంటే పెద్ద సినిమాల బడ్జెట్ మరింత పెరిగిపోయింది. సినిమా అవుట్ బాగా రావడం కోసం నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. అయితే వీరికి ఏపీ ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందించకపోగా ఇండస్ట్రీ దెబ్బతినేలా వ్యవహరిస్తోంది.

    సినిమా టికెట్లను తగ్గించడంతోపాటు బెనిఫిట్ షోలను సైతం ఏపీ సర్కార్ రద్దు చేసింది. ఈ వ్యవహరం మొత్తం సినిమాల కలెక్షన్లపై ప్రభావం చూపనుండటంతో సినీ ఇండస్ట్రీ పెద్దలు మరోసారి సీఎం జగన్ తో మాట్లాడేందుకు సిద్ధం అమవుతున్నారు. అయితే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాత్రం జగన్ అధికారంలో ఉన్నంత వరకు సినిమా టికెట్ల  రేట్లు పెరగవని, బెనిఫిట్ షోలు ఉండవంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఇండస్ట్రీ కలవరపాటుకు గురవుతోంది.

    ఇటీవల రిలీజైన ‘అఖండ’ విషయంలోనూ జగన్ సర్కార్ ఇలానే వ్యవహరించింది. కాగా తెలంగాణలో మునుపటిలాగే పెద్ద సినిమాలకు బెనిషిట్ షోలు, సినిమా టికెట్ల పెంపును ప్రభుత్వం వర్తింపజేసింది. ఏపీలో మాత్రం టికెట్లను తగ్గించడంతోపాటు బెనిఫిట్ షోలను రద్దు చేసింది. దీంతో సినిమా కలెక్షన్లు రావాల్సిన దానికంటే 15కోట్లు తక్కువగా వచ్చాయని తెలుస్తోంది. ఇక త్వరలో రాబోయే ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ప్రభుత్వం ఇలానే వ్యవహరించనుంది.

    పెద్ద సినిమాలకు సినిమా టికెట్లు తగ్గించడం వల్ల తమకు తీవ్రంగా నష్టం కలుగుతుందనే విషయాన్ని మరోసారి ఏపీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ రెడీ అవుతోంది. ఈ ఇష్యూపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో జక్కన్న స్పందించారు. అయితే ఏపీ సర్కారు మాత్రం ‘ఆర్ఆర్ఆర్’పై నీళ్లు చల్లే అవకాశమే ఎక్కువగా ఉందనే టాక్ విన్పిస్తోంది. ఇదే కనుక జరిగితే ‘ఆర్ఆర్ఆర్’ సైతం అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టక పోవచ్చనే టాక్ విన్పిస్తోంది.