Jagadeka Veerudu Atiloka Sundari : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి సరైన బ్లాక్ బస్టర్ తగిలితే ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చెప్పడానికి రీసెంట్ గా విడుదలైన ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి'(Jagadeka Veerudu Athiloka Sundari) చిత్రం నిరూపించింది. 35 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని రీసెంట్ గానే నిర్మాత అశ్వినీ దత్ రీ మాస్టర్ చేయించి 3D లో విడుదల చేయించాడు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. అంత పాత సినిమాని ఈ కాలం లో ఎవరు చూస్తారు, అనవసరం గా రీ రిలీజ్ చేస్తున్నారు, ప్రింట్ ఖర్చులు వృధా అని చాలా మంది కామెంట్స్ చేసారు. ఎందుకంటే బాలకృష్ణ సినిమాల్లో క్లాసిక్ గా నిల్చిన ‘ఆదిత్య 369’ రీ రిలీజ్ కి ఘోరమైన రెస్పాన్స్ వచ్చింది కాబట్టి. కానీ చిరంజీవి కి మాత్రం అలాంటి హద్దులేమి ఉండవని ఈ సినిమా నిరూపించింది.
Also Read : జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ సక్సెస్ అయిందా? ఫెయిల్యూయర్ గా నిలిచిందా..?
వీకెండ్ వరకు కలెక్షన్స్ బాగుండడం సహజమే, ఆ తర్వాత రీ రిలీజ్ చిత్రానికి వసూళ్లు కొనసాగడం కష్టం అని రీసెంట్ గా విడుదలైన కొన్ని రీ రిలీజ్ చిత్రాలు నిరూపించాయి. కానీ ‘జగదేక వీరుడు..అతి లోకసుందరి’ మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ వర్కింగ్ డేస్ లో స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటుంది. 5 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నైజాం ప్రాంతం నుండి 91 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, సీడెడ్ ప్రాంతం నుండి 30 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి కోటి 4 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కేవలం నార్త్ అమెరికా నుండి ఈ చిత్రం 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇది ఆల్ టైం టాప్ 5 రీ రిలీజ్ చిత్రాల్లో ఒకటి. ఇంద్ర చిత్రం రీ రిలీజ్ కి 60 వేలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తే, ఈ చిత్రానికి 50 వేలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి, ఇంకా థియేట్రికల్ రన్ అక్కడ పూర్తి అవ్వలేదు. ఈ వారం కూడా రన్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా 5 రోజుల్లో కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి 54 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. మొత్తం మీద 5 రోజుల్లో 2 కోట్ల 84 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో మూడు కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా దాటే ఛాన్స్ ఉంది.