Jagadeka Veerudu : తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రాల్లో ఒకటి ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి'(Jagadeka Veerudu..Athiloka Sundari). వైజయంతి మూవీస్ బ్యానర్ పై, రాఘవేంద్ర రావు దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), శ్రీదేవి(Sridevi) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో సృష్టించిన సునామీని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఒక పక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వరదలు, జనాలు బయట తిరగలేని పరిస్థితి, సినిమాని వాయిదా వేద్దాం అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. అలాంటి సమయం లో చిరంజీవి ప్రోత్సాహంతో ధైర్యం గా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. జనాలు వరదలను కూడా లెక్కచేయకుండా థియేటర్స్ కి ఎగబడి వెళ్లి ఈ చిత్రాన్ని చూసారు. అలా ఈ చిత్రం విడుదలై 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మే9 న మరోసారి 3D లోకి మార్చి గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు.
Also Read: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ ఆ హిట్ సినిమా కి రీమేక్ గా రాబోతోందా..?
మరీ అంత పాత సినిమాని ఇప్పటి తరం ఆడియన్స్ ఎందుకు చూస్తారు అని చాలా మంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ చిత్రం మొదటి రోజున కోటి 55 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక రెండవ రోజు కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా ఈ చిత్రానికి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ 3D లో చూసేందుకు అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. క్వాలిటీ కూడా అదిరిపోయిందట. 3D లో శ్రీదేవి అందాలను చూడాలో, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి ని చూడాలో తెలియని సందిగ్దత ఏర్పడేలా చేసిందట ఈ చిత్రం. దీనిని బట్టి క్వాలిటీ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి రెండు రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో అక్షరాలా ఈ చిత్రానికి రెండు రోజుల్లో 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నేటితో కోటి రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా సీడెడ్ లో 20 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మహేష్ బాబు రీసెంట్ రీ రిలీజ్ మూవీస్ కంటే ఎక్కువ అనొచ్చు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఏకంగా 78 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు రోజుల్లో కోటి 68 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల 3 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో మూడు కోట్ల రూపాయిలను టచ్ చేయొచ్చు.
Also Read : దుమ్ములేపిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!