https://oktelugu.com/

Jacqueline Fernandez: మీ సొంత వాళ్ళకు ఇలా చేయరు కదా.. హీరోయిన్ విన్నపం !

Jacqueline Fernandez: బాలీవుడ్ బోల్డ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చాలా ఓపెన్ గా ఉంటుంది. గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూ సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా కూడా జాక్వెలిన్ పేరు మోసింది. కాగా తాజాగా ఈ బ్యూటీ మీడియాకి ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఇక నుంచి సుకేష్ చంద్రశేఖర్ తో లీక్ అయిన తన ఫోటోలను ప్రసారం చేయవద్దని.. అలా చేయడం వల్ల తన గోప్యతకు తీవ్రంగా భంగం కలుగుతుందని జాక్వెలిన్ చెప్పుకొచ్చింది. ఇంతకీ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 9, 2022 / 12:31 PM IST
    Follow us on

    Jacqueline Fernandez: బాలీవుడ్ బోల్డ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చాలా ఓపెన్ గా ఉంటుంది. గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూ సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా కూడా జాక్వెలిన్ పేరు మోసింది. కాగా తాజాగా ఈ బ్యూటీ మీడియాకి ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఇక నుంచి సుకేష్ చంద్రశేఖర్ తో లీక్ అయిన తన ఫోటోలను ప్రసారం చేయవద్దని.. అలా చేయడం వల్ల తన గోప్యతకు తీవ్రంగా భంగం కలుగుతుందని జాక్వెలిన్ చెప్పుకొచ్చింది.

    Jacqueline Fernandez

    ఇంతకీ జాక్వెలిన్ తన ఇన్ స్టా ఖాతాలో పెట్టిన మెసేజ్ ఏమిటంటే.. ఆమె మాటల్లోనే.. ‘ఈ దేశం ప్రజలు నా పై ఎప్పుడూ విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని చూపించారు.అలాగే నాకు మీడియాలో మంచి సన్నిహితులు ఉన్నారు. వారి నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. అయితే, మీకు తెలుసు.. నేను ప్రస్తుతం కొన్ని కఠినమైన పరిస్థితులలో ఉన్నాను అని. కానీ అవి ఎక్కువ కాలం ఉండవు.

    కాబట్టి.. నా గోప్యత, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే ఫోటోలను దయచేసి ఎవ్వరూ ప్రసారం చేయవద్దు. నేను మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. మీరు మీ సొంత వాళ్ళ విషయంలో ఇలా చేయరు కదా. నాకు కూడా మీరు ఇలా చేయరని ఆశిస్తున్నాను. ఎప్పటికైనా న్యాయం, చిత్తశుద్ది గెలుస్తుందని నేను నమ్ముతున్నాను’ అంటూ జాక్వెలిన్ చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీలంక నుంచి వచ్చిన జాక్వెలిన్ నటిగా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.

    పైగా బోల్డ్ పాత్రలకు ఆమె తెగింపు మరింత ప్లస్ అయింది. ఇక్కడ సినిమాలలో నటిస్తూ ఆమె ఇండియాలోనే సెటిల్ అయింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తీస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఒక రాకుమారిగా నటించబోతుంది జాక్వెలిన్. వచ్చే నెలలో జరగనున్న ఈ సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొననుంది.

    Also Read: Unmarried Actresses: 45 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి చేసుకోని ముదురు హీరోయిన్లు వీళ్లే..!

    నిజానికి ఈ బాలీవుడ్ బోల్డ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతంలో ఓ సీనియర్ హీరోతో ప్రేమలో మునిగి తేలింది. ఆ తరువాత ఈ భారీ బ్యూటీ, ఆ హీరోకి దూరం అయింది. అయితే, ఇప్పుడు ఆమె తన ప్రేమ వల్లే కష్టాల్లో పడింది.

    Also Read: Pooja Hegde: జిమ్ ట్రైనర్ తో పూజా హెగ్డే కసరత్తులు.. వీడియో వైరల్ !

    Tags