Varma: ఆ పాట అంటే ఎంతో ఇష్టం కానీ.. పిక్చరైజేషన్ నచ్చలేదంటున్న వర్మ..!

Varma: టాలీవుడ్లో వివాదాస్పద దర్శకుడిగా రాంగోపాల్ వర్మకు పేరుంది. కాంట్రవర్సీలనే తన పబ్లిసిటీకి ఆయుధంగా మలుచుకుంటూ సినిమాలను తెరకెక్కించడంలో రాంగోపాల్ వర్మ దిట్టనే చెప్పొచ్చు. రాంగోపాల్ వర్మ సినిమాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాను తెరకెక్కించే విధానాన్ని చాలా మంది కొత్త దర్శకులు ఇన్పిరేషన్ గా తీసుకుంటారు. రాంగోపాల్ తొలి సినిమా ‘శివ’ దగ్గరి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన సంగీతానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాల్లోని పాటలకు మ్యూజిక్ చేయించుకుంటూ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 9, 2022 12:49 pm
Follow us on

Varma: టాలీవుడ్లో వివాదాస్పద దర్శకుడిగా రాంగోపాల్ వర్మకు పేరుంది. కాంట్రవర్సీలనే తన పబ్లిసిటీకి ఆయుధంగా మలుచుకుంటూ సినిమాలను తెరకెక్కించడంలో రాంగోపాల్ వర్మ దిట్టనే చెప్పొచ్చు. రాంగోపాల్ వర్మ సినిమాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాను తెరకెక్కించే విధానాన్ని చాలా మంది కొత్త దర్శకులు ఇన్పిరేషన్ గా తీసుకుంటారు.

Ram Gopal Varma

రాంగోపాల్ తొలి సినిమా ‘శివ’ దగ్గరి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన సంగీతానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాల్లోని పాటలకు మ్యూజిక్ చేయించుకుంటూ మ్యూజికల్ హిట్స్ అందుకుంటాడు. ‘శివ’, ‘క్షణక్షణం’, ‘గోవింద గోవింద’, ‘రంగీలా’ వంటి సినిమాలు ఆ కోవలోకి చెందినవే. రాంగోపాల్ వర్మ ఆల్ టైం ఫేవరేట్ పాటల్లో ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే సాంగ్ ఒకటి.

సిరివెన్నల సీతరామ శాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ పాటలోని ప్రతీ అక్షరం వర్మకు కంఠస్తమే. ప్రతీఒక్కరికి మోటివేషనల్ గా అనిపించే ఈ పాట అంటే వర్మ చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే ఈపాట పిక్చరైజేషన్ మాత్రం తనకు నచ్చలేదని.. ఈ పాటను తెరకెక్కించిన విధానం చూస్తే చచ్చిపోవాలని ఒక్కోసారి అనిపింస్తుందని ఘాటు కామెంట్ చేశాడు.

తనకు తెలిసినంత వరకు ప్రపంచంలోని అత్యుత్తమ పాట ఇదేనంటూ కితాబిచ్చాడు. ఈ పాటను దర్శకుడు ‘బాహుబలి’ రేంజులో తెరకెక్కించాలని కానీ చెడగొట్టాడంటూ తన ఆవేదనను వెళ్లగక్కాడు. సీతరామ శాస్త్రి పాటలను ఎక్కువగా ఇష్టపడే రాంగోపాల్ వర్మ ఆయన తొలి సినిమా ‘సిరివెన్న’లోని పాటలను ఇప్పటి వరకు వినలేదట. తనకు అలాంటి పాటలు ఇష్టముండవని అందుకే చూడలేదని వర్మ స్ఫష్టం చేశాడు. కాగా ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే పాటను ‘పట్టుదల’ అనే మూవీలో హీరో సుమన్ పై తెరకెక్కించారు.