Jabardasth Varsha: వర్ష బుల్లితెర స్టార్ గా అవతరించింది. ఈ అందాల భామ క్రేజ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇక సోషల్ మీడియా వేదికగా వర్ష చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తన గ్లామర్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వర్ష గతంలో హోమ్లీ ఫోటో షూట్స్ చేసేది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచింది. బోల్డ్ లుక్ లో షాక్ ఇస్తుంది. తాజాగా రెడ్ ట్రెండీ వేర్లో మనసులు దోచేసింది. వర్ష గ్లామరస్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
వర్షకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఏకంగా 2 మిలియన్స్ ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అలాంటిది మరి. ఓ మోస్తరు హీరోయిన్ స్థాయి ఫాలోయింగ్ ఇది. కేవలం బుల్లితెర సెలబ్ గా ఆమె లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. వర్ష గతంలో సీరియల్స్ లో నటించేది. ఆమె కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది.
పలు సీరియల్స్ లో వర్ష నటించింది. అయినా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో జబర్దస్త్ కమెడియన్ గా మారింది. ఈ షో వేదికగా అనేక మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు. వర్షకు కూడా జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. అనతి కాలంలో వర్ష పాప్యులర్ అయ్యింది. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టాప్ రేటెడ్ షోల్లో వర్ష సందడి చేస్తుంది. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్స్ వర్క్ అవుట్ అయ్యాయి.
జబర్దస్త్ కమెడియన్ నుండి ఓ షోకి యాంకరింగ్ చేసే స్థాయికి వెళ్ళింది వర్ష. సుమన్ టీవీలో ఓ షోకి ఇమ్మానియేల్, వర్ష యాంకరింగ్ చేస్తున్నారు. వర్ష కెరీర్లో ఎదిగిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ ఓపెనింగ్స్ కి కూడా వర్ష వెళుతుంది. ఆమె సంపాదన లక్షలకు చేరింది. జబర్దస్త్ షోతో వచ్చిన ఫేమ్ తో వర్ష కెరీర్లో సెటిల్ అయ్యింది.
View this post on Instagram