https://oktelugu.com/

Jabardasth Varsha – Emmanuel : జబర్దస్త్ వర్ష-ఇమ్మానియేల్.. ఆ పనిచేసి అందరికీ షాకిచ్చారు

పక్కనే ఉన్న యాంకర్ రష్మీ ని పిలిచి మ్యాటర్ చెప్పారు. దీంతో రష్మీ చాలా మంచిది. నా దగ్గర కూడా కొన్ని టిప్స్ తీసుకోండి అని చెప్పింది. అలాగే నా ఆశీర్వాదం తీసుకోండి అంటూ ఇద్దరినీ బ్లెస్ చేసింది. ఆ తర్వాత వర్ష - ఇమ్ము కలిసి రాకింగ్ రాకేష్ కి చెప్పేందుకు వెళ్లారు. రాకేష్ బట్టలు ఆరేస్తూ ఉంటాడు. ఓ గుడ్ న్యూస్ చెప్పాలని రాకేష్ తో... వర్ష, ఇమ్మానియేల్ అంటారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 14, 2024 / 12:01 PM IST

    varsha Emmanuel

    Follow us on

    Jabardasth Varsha – Emmanuel : జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో వర్ష ఒకరు. తన కామెడీ టైమింగ్ తో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. గెస్ట్ గా వచ్చి జబర్దస్త్ లో సెటిల్ అయింది. ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో వర్ష నడిపించిన లవ్ ట్రాక్ బాగా క్లిక్ అయింది. ఈ జంట కెమిస్ట్రీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అలా లవ్ ట్రాక్ కంటిన్యూ చేస్తూ తమ క్రేజ్ పెంచుకుంటున్నారు. తాజాగా వర్ష – ఇమ్మాన్యుయేల్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

    సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది వర్ష. అభిషేకం, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ లో నటించింది. అక్కడ బ్రేక్ రాలేదు. దాంతో జబర్దస్త్ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే పాపులారిటీ దక్కించుకుంది. బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా ఈటీవీలో హవా సాగిస్తుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తుంది. కాగా ఇమ్మానుయేల్ – వర్ష కలిసి ఓ స్కిట్ చేశారు. స్టేజ్ పైకి వచ్చిన వెంటనే మీ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పారు.

    పక్కనే ఉన్న యాంకర్ రష్మీ ని పిలిచి మ్యాటర్ చెప్పారు. దీంతో రష్మీ చాలా మంచిది. నా దగ్గర కూడా కొన్ని టిప్స్ తీసుకోండి అని చెప్పింది. అలాగే నా ఆశీర్వాదం తీసుకోండి అంటూ ఇద్దరినీ బ్లెస్ చేసింది. ఆ తర్వాత వర్ష – ఇమ్ము కలిసి రాకింగ్ రాకేష్ కి చెప్పేందుకు వెళ్లారు. రాకేష్ బట్టలు ఆరేస్తూ ఉంటాడు. ఓ గుడ్ న్యూస్ చెప్పాలని రాకేష్ తో… వర్ష, ఇమ్మానియేల్ అంటారు.

    దీంతో రాకేష్ .. పెళ్ళైన మేము ఇంతవరకు గుడ్ న్యూస్ చెప్పలేదు. పెళ్ళికి ముందే మీరు గుడ్ న్యూస్ చెపుతున్నారంటే .. మీకు కంగ్రాట్స్ అని అంటాడు. మేము చెప్పబోయేది, మీరు అనుకుంటున్నది కాదు .. నేను టీం లీడర్ అయ్యాను అన్నయ్య అని ఇమ్మాన్యుయేల్ అంటాడు. ఇక వదినకు కూడా చెబుతాను…. అని సుజాతకు విషయం చెబుతాడు. బాగా కామెడీ చేసి అందరిని నవ్వించండి అని సుజాత ఎంకరేజ్ చేసింది. అలా స్కిట్ ముగించారు. కాగా టీం లీడర్ అయినందుకు ఇమ్మూకి నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు.