Jabardasth Varsha: బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దానికి పైనుంచి ఈ కామెడీ షో తెలుగువారిని కడుపుబ్బా నవ్విస్తూ వస్తుంది. ఈ షో ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా కూడా ప్రేక్షకులలో జబర్దస్త్ కామెడీ షో కు ఆదరణ తగ్గడం లేదు. ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి యాంకర్లు, కంటెస్టెంట్స్ చివరకు జడ్జీలు అంతా మారిపోయిన కూడా ఇప్పటికి నెంబర్ వన్ కామెడీ షో గా కొనసాగుతుంది. బుల్లితెరపై టాప్ టిఆర్పి తో తన సత్తా చాటుతుంది జబర్దస్త్ కామెడీ షో. ఎప్పటి లాగానే ఈవారం కూడా ఈ షోకు సంబంధించిన ఒక ప్రోమోనో రిలీజ్ చేసింది ఈటీవీ. ఈ కామెడీ షో నుంచి ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్లు తమ టాలెంట్‌ను నిరూపించుకొని బుల్లితెర మీద అలాగే వెండి ధర మీద అవకాశాలు దక్కించుకొని హీరోలుగా, దర్శకులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కమెడియన్లుగా రాణిస్తున్నారు. ఇక ఈ షోకు కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు లో తమదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో తాగుబోతు రమేష్, నూకరాజులు తమ స్కిట్ తో వస్తారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని నెలకు రూ.40 వేల జీతం అని రమేష్ అంటాడు. అప్పుడే సాఫ్ట్వేర్ ఇంజనీర్, దండెమ్ మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేనని ఎప్పుడు పడిపోతాయో తెలియదని నూకరాజు పంచ్ వేస్తాడు. ఆ తర్వాత తన టీం తో వచ్చి పటాస్ పైన సందడి చేస్తుంది. ఇక అప్పుడే టీ ఇవ్వమని అడగ్గా టి అంటే క్యాపిటల్ టి నా లేక స్మాల్ టీనా అని పంచి వేయడంతో అతని చెంప పగలగొడుతుంది పైమా.
బుల్లెట్ భాస్కర్ ని నిన్నే పెళ్లి చేసుకుంటానని ఫైమా వేధించగా నేను చేసుకోనని భాస్కర్ చెప్తాడు. మా అక్క ని పెళ్లి చేసుకుంటే చంపేస్తాం అని ఫైమా అనుచరులు కత్తితో బెదిరించగా, ఫైమా వచ్చి బావ అమాయకుడని ఏం అనద్దు అని అంటుంది. ఆ తర్వాత డాక్టర్ వచ్చి ఈ ట్రైన్ పట్టాలెక్కదని, సైకిల్ ఒకే గాని బెల్ కొట్టలేదని చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వేస్తారు. ఇక ఆ తర్వాత మేమిద్దరం మొగుడు పెళ్ళాం అని వర్షా, ఇమ్యాన్యుయల్ ఎంట్రీ ఇస్తారు.వర్ష నీతో స్కిట్ చేస్తుంటే ఏదో కొత్త కొత్తగా ఉంది అని చెప్పినప్పుడు, నువ్వు కొత్త కొత్త రుచులు మరిగాక మాతో చేయాలంటే కొత్తగానే ఉంటుంది అని ఇమాన్యుయల్ పంచ్ వేస్తాడు.
ఇక ఇద్దరు కలిసి పెళ్లికి ముందు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివాజీ గారు రోజు పాలకు వెళ్తున్న ఆయన టవల్‌ను ఏ రోజు చూడలేదని వర్షా అంటుంది. ఇక్కడ నిప్పుల గుండం పెడితే పతివ్రతల లేచి వస్తానని వర్షా అనడంతో, ఒసేయ్ కాలిపోతావే అంటూ రష్మీ పంచ్ వేస్తుంది. ఇక వర్ష తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుందో లేదో తెలియాలంటే ఈ శనివారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.