Minister Roja: జబర్దస్త్ జడ్జి రోజా ఇక మంత్రి కావడంతో ఇకపై ఆ షోకూ దూరం కానున్నారు. ఇన్నాళ్లు జబర్దస్త్ అంటేనే రోజాగా వినుతికెక్కిన ప్రోగ్రాం ఇక ఆమె లేకుండానే నెట్టుకు రానుంది. మంత్రి అయిన తరువాత బాధ్యతలు పెరుగుతాయని జబర్దస్త్ కు రావడం లేదని తెలుస్తోంది కానీ కమెడియన్లు అందరు ఆమె ఇక రాదని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు దైవంతో సమానమని ఏ తప్పు చేసినా తమను సొంత బిడ్డలుగానే చూసుకున్నారని విలపించారు.

తన నవ్వులతో అందరిని మైమరపించే రోజా జబర్దస్త్ కు ఓ టానిక్ లా పనిచేశారు. అందరిని సమన్వయం చేసుకుని షోను ఎక్కడికో తీసుకెళ్లడం తెలిసిందే. ఇన్నాళ్లు అందరితో కలివిడిగా మసలుకున్న ఆమెకు మంత్రి పదవి వరించడంతో ఇక తాను జబర్దస్త్ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు చింతించారు. అందరిని పట్టుకుని ఏడ్చారు.
Also Read: Sai Ganesh Suicide Issue: బీజేపీ నేతల చావులను ‘కులం’ కార్డుతో కవర్ చేస్తారా?
జబర్ధస్త్ టీం చివరి కోరికను మంత్రి రోజా తీరుస్తుందా?
మల్లెమాల ప్రొడక్షన్ కు తానెంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆమె కన్నీరు కార్చడం తెలిసిందే. ఈ మేరకు సుడిగాలి సుధీర్ రోజా గారు మళ్లీ రావాలని ఆకాంక్షించారు. రోజా కాళ్లపై పడి ఆశీర్వాద తీసుకున్నాడు. అనంతరం ఆటో రాంప్రసాద్ సైతం తనకు రోజా మేడం లైఫ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. తనకు ఆటో రాంప్రసాద్ అని పేరు పెట్టింది కూడా రోజాగారే అని బాధాతప్త హృదయంతో అన్నాడు.

ఇక్కడే ఇదే స్టేజీ మీదే ఎమ్మెల్యే అయ్యాను. తరువాత మంత్రి కూడా అయ్యాను. మల్లెమాల తనకు ఎంతో జీవితం ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఇంతటి బంగారు అవకాశాలను ఇచ్చిన మాతృసంస్థను ఎప్పటికి మరిచిపోలేనని చెప్పుకొచ్చారు. మరో జీవితం ఉంటే మల్లెమాలకే తన సేవలు అందజేస్తానని చెప్పడం గమనార్హం. రోజా తన జీవితంలో అన్ని అవకాశాలను ఇచ్చిన ఘనత మల్లెమాలకే దక్కుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా మల్లెమాల ప్రొడక్షన్ మరో జడ్జిని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read:Jeevitha Rajasekhar: మోసం చేసి.. బుకాయిస్తే ఎలా జీవిత గారు ?
[…] KGF 2 Collection: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. […]
[…] Acharya Pre Release Event: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఈ వేడుక జరుగనున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. రాత్రి 11 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. […]