Homeఎంటర్టైన్మెంట్Jabardasth Sunny Story: లవ్ ఫెయిల్యూర్ తో దేవదాసైన జబర్దస్త్ కమెడియన్... కోట్లు ఉన్నా అలాంటి...

Jabardasth Sunny Story: లవ్ ఫెయిల్యూర్ తో దేవదాసైన జబర్దస్త్ కమెడియన్… కోట్లు ఉన్నా అలాంటి జీవితం గడుపుతున్న సన్నీ!

Jabardasth Sunny Story: సీనియర్ జబర్దస్త్ కమెడియన్స్ లో సన్నీ(JABARDASTH SUNNY) ఒకరు. సుడిగాలి సుధీర్ టీమ్ లో ఎక్కువగా స్కిట్స్ చేసేవాడు. సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, సన్నీ ఒక టీమ్ గా జబర్దస్త్(JABARDASTH) లో సంచలనాలు చేశారు. అయితే సన్నీకి రావాల్సినంత స్థాయిలో గుర్తింపు రాలేదు. అందుకు కారణం… సన్నీకి స్కిట్స్ లో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. డైలాగ్స్ కూడా రాయరు. దీనిపై స్కిట్స్ లో కూడా సన్నీ మీద వారు జోక్స్ వేసేవారు. సన్నీ కూడా స్కిట్ లో హైలెట్ కావాలని, మిగతా ముగ్గురిలా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది లేదు. సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో సన్నీ ప్రయాణం ఏళ్ల తరబడి సాగింది.

జబర్దస్త్ సన్నీ పలు చిత్రాలు సైతం చేశాడు. జులాయి మూవీలో దొంగగా సన్నీ చేసిన చిన్న పాత్ర గుర్తుండి పోతుంది. అయితే జబర్దస్త్ కమెడియన్ గానే సన్నీకి పేరుంది. సిల్వర్ స్క్రీన్ మీద అంతగా సన్నీ రాణించలేదు. కాగా సన్నీకి వివాహం కాలేదు. ఏజ్ బారైనా.. ఇంకా వివాహం చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందట. అతడు లవ్ ఫెయిల్యూర్ అట. ఓ సందర్భంలో రష్మీ గౌతమ్ సన్నీని ఎందుకు వివాహం చేసుకోవడం లేదని అడిగింది.

Also Read: వాళ్లకు పిచ్చెక్కిస్తున్న డార్లింగ్ ప్రభాస్..! ఆయనకే క్లారిటీ లేదా?

దాంతో సన్నీ ఎమోషనల్ అయ్యాడు. తన విషాద ప్రేమ గాధను బయటపెట్టాడు. ఒక అమ్మాయిని సన్నీ ఎనిమిదేళ్లు ప్రేమించాడట. తననే వివాహం చేసుకోవాలని అనుకున్నాడట. కానీ ఆ అమ్మాయి సన్నీకి హ్యాండ్ ఇచ్చి మరొక వ్యక్తిని వివాహం చేసుకొని వెళ్లిపోయిందట. దాంతో డిప్రెషన్ కి గురయ్యాడట. ప్రేమ, పెళ్లి మీద విరక్తి పెంచుకుని తాగుడుకు బానిసయ్యాడట. అక్కడే ఉన్న రామ్ ప్రసాద్ కల్పించుకుని మరికొన్ని షాకింగ్ మేటర్స్ రివీల్ చేశాడు.

సన్నీ కోటీశ్వరుడు అట. వాళ్ళ అన్నయ్య, వదిన డాక్టర్స్ అట. అయినప్పటికీ సన్నీ ఇంట్లో ఉండడు అట. తమ రూమ్స్ లోనే తాగి పడుకుంటాడు.. అని రామ్ ప్రసాద్ సన్నీని ఉద్దేశించి చెప్పుకొచ్చాడు. లవ్ బ్రేకప్ కారణంగా తాగుడుకు బానిసైన సన్నీ… లైఫ్ ని వదిలేశాడని రామ్ ప్రసాద్ అతని విషాద జీవితాన్ని బయటపెట్టాడు. జబర్దస్త్ వేదిక మీద నాన్ స్టాప్ గా నవ్వులు పూయించే సన్నీ జీవితంలో ఇంత విషాదం ఉందా… అని బుల్లితెర ఆడియన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular