https://oktelugu.com/

Sudigali Sudheer Remuneration: సుడిగాలి సుధీర్ సంపాదన ఎంతో తెలుసా..? స్టార్ హీరోలు కూడా పనికిరారు

Sudigali Sudheer Remuneration: వెండితెర మీద కనిపించే నటులకు మాత్రమే కాదు..బుల్లితెర మీద కనిపించే నటులకు కమెడియన్స్ కి కూడా యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది..ముఖ్యంగా ఈటీవీ లో ప్రసారం అయ్యే కామెడీ షో జబర్దస్త్ నుండి ఎంత మంది ఇండస్ట్రీ కి వచ్చి నేడు టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న కమెడియన్స్ గా కొనసాగుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అలాంటి కమెడియన్స్ లో ఒక్కరు సుడిగాలి సుధీర్..నేడు జబర్దస్త్ షో ఇప్పటికి టాప్ మోస్ట్ TRP రేటింగ్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 16, 2022 / 05:21 PM IST
    Follow us on

    Sudigali Sudheer Remuneration: వెండితెర మీద కనిపించే నటులకు మాత్రమే కాదు..బుల్లితెర మీద కనిపించే నటులకు కమెడియన్స్ కి కూడా యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది..ముఖ్యంగా ఈటీవీ లో ప్రసారం అయ్యే కామెడీ షో జబర్దస్త్ నుండి ఎంత మంది ఇండస్ట్రీ కి వచ్చి నేడు టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న కమెడియన్స్ గా కొనసాగుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అలాంటి కమెడియన్స్ లో ఒక్కరు సుడిగాలి సుధీర్..నేడు జబర్దస్త్ షో ఇప్పటికి టాప్ మోస్ట్ TRP రేటింగ్స్ తో ముందుకి దూసుకుపోతుంది అంటే దానికి కారణం సుధీర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..కేవలం ఈయన స్కిట్స్ కోసమే ఈ షో ని చూసే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది..అందుకే కమెడియన్ గా మరియు హీరో గా సినిమాల్లో ఎంత బిజీ అయ్యినప్పటికీ కూడా సుధీర్ జబర్దస్త్ షో లో ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాడు..మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా సుధీర్ కి ఇందుకుగాను భారీ మొత్తం లోనే పారితోషికం అందిస్తున్నారు..ఒక్క ఈ షో మాత్రమే కాదు..ఈటీవీ లో ఎంటర్టైన్మెంట్ షోస్ అన్ని సగం సుధీర్ మీదనే ఆధారపడి నిన్న మొన్నటి వరుకు నడుస్తూ ఉండేవి..ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో బాగా బిజీ అవ్వడం తో ఢీ అనే డాన్స్ షో ని వదులుకోవాల్సి వచ్చింది.

    Sudigali Sudheer Remuneration

    ఇది ఇలా ఉండగా సుడిగాలి సుధీర్ ఒక్క ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..ఈయన ఒక్క ఏడాది లో సంపాదించే సంపాదన మన టాలీవుడ్ లో కొంతమంది యువ హీరోలు కూడా సంపాదించలేరు అని చెప్పొచ్చు..ఈటీవీ లో గతం లో ఆయన ఢీ , జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎంటర్టైన్మెంట్ షోస్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ ఎపిసోడ్స్ చేసినందుకు గాను ఒక్కో ఎపిసోడ్ కి రెండు లక్షల రూపాయిలు పారితోషికంగా ఇచ్చేవారు అట..అలా ఆయన కేవలం జబర్దస్త్ అనే కామెడీ షో నుండి ఒక్క ఏడాది కి గాను రెండు కోట్ల 72 లక్షల రూపాయిలు సంపాదిస్తాడు అట..అలా డీ షో లో పాల్గొనేందుకు ఆయనకీ ఒక్క ఏడాది కోసం దాదాపుగా ఒక్క కోటి 36 లక్షల రూపాయిలు, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేస్తున్నందుకు గాను రెండు కోట్ల రూపాయిలు ఒక్క ఏడాది కి సంపాదించేవాడు అట..అలా కేవలం మూడు షోస్ నుండి ఆయన సంపాదన దాదాపుగా ఒక్క ఏడాది కి సుమారుగా ఆరు కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నాడు అని తెలుస్తుంది..ఇవి మాత్రమే కాకుండా పండగ స్పెషల్ గా వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి కూడా సుడిగాలి సుధీర్ తప్పకుండా ఉండే సంగతి మన అందరికి తెలిసిందే..అలా అన్ని కలుపుకొని కేవలం ఒక్క ఈటీవీ ఛానల్ నుండే ఆయన ఏడాదికి దాదాపుగా 7 కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నాడు.
    Also Read: కొడుకుపై చిరంజీవి మమకారం.. ఆ ‘హనుమ’పై ప్రేమకు ఇది త్కారాణం

    అయితే ఈఏడాది నుండి ఆయన ఈటీవీ లో ప్రసారం అయ్యే ఢీ షో మానేసిన సంగతి మన అందరికి తెలిసిందే..దానికి కారణం ఆయనకీ ఆ షో చెయ్యడానికి తగిన సమయం కేటాయించలేకపోవడమే అని పలు ఇంటర్వూస్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆయన ఈటీవీ లో కేవలం జబర్దస్త్ మరియు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోస్ మాత్రమే చేస్తున్నాడు..ఇవి కాకుండా ప్రస్తుతం ఆయన హీరో గా మూడు సినిమాల్లో ఒక్కేసారి నటిస్తున్నాడు..అందులో ‘కాలింగ్ సహస్త్ర’ మరియు ‘గాలోడు’ అనే రెండు సినిమాలు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం గా ఉన్నాయి..ఈ సినిమాలతో పాటుగా ఆయన కమెడియన్ గా వరుసగా డజను సినిమాల్లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అలా బుల్లితెర మరియు వెండితెర కలిపి ఒక్క ఏడాది కి గాను ఈయన 10 కోట్ల రూపాయలకు పైగానే డబ్బులు సంపాదిస్తూ అత్యంత కాస్టలీ నటులలో ఒక్కరిగా నిలిచారు..మన టాలీవుడ్ లో కొంతమంది హీరోలు ఏడాది మొత్తం కలిపి ఒక్క సినిమా చేసిన కూడా 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఉండదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..అలాంటిది సుధీర్ వాళ్ళకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

    Also Read: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల బిజినెస్ ని దాటేసిన విజయ్ దేవరకొండ లైగర్

    Tags