https://oktelugu.com/

Tollywood 2021: టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా ఆయనే..!

Tollywood 2021 : టాలీవుడ్లో ‘నెంబర్ వన్’ పోటీ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటోంది. ఈ నెంబర్ గేమ్ పై ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ ప్రతీ నెలా సర్వే చేపడుతోంది. 2021 సంవత్సరం ముగియడంతో ఓవరాల్ గా ఆ ఏడాది నెంబర్ వన్ గా నిలిచిన హీరోతోపాటు మొత్తం పది స్థానాల్లో నిలిచిన హీరోల పేర్లను ఆర్మాక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెంబర్ వన్ స్థానాన్ని మళ్లీ నిలుపుకున్నాడు. 2021 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 16, 2022 / 05:14 PM IST
    Follow us on

    Tollywood 2021 : టాలీవుడ్లో ‘నెంబర్ వన్’ పోటీ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటోంది. ఈ నెంబర్ గేమ్ పై ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ ప్రతీ నెలా సర్వే చేపడుతోంది. 2021 సంవత్సరం ముగియడంతో ఓవరాల్ గా ఆ ఏడాది నెంబర్ వన్ గా నిలిచిన హీరోతోపాటు మొత్తం పది స్థానాల్లో నిలిచిన హీరోల పేర్లను ఆర్మాక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది.

    సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెంబర్ వన్ స్థానాన్ని మళ్లీ నిలుపుకున్నాడు. 2021 సంవత్సరంలోని ప్రతీ నెలలోనూ మహేష్ బాబే నెంబర్ హీరోగా కొనసాగాడు. దీంతో ఓవరాల్ గా నెంబర్ వన్ ప్లేస్ ఆయనకే దక్కింది. కిందటేడాది ‘సరిలేరునికెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న మహేష్ ఈ ఏడాది ‘సర్కారువారిపాట’తో రాబోతున్నాడు.

    రెండో ప్లేసులో అల్లు అర్జున్ నిలిచాడు. గత నెలలో నాలుగు స్థానంలో ఉన్న అల్లు అర్జున్ ఓవరాల్ గా మాత్రం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో అల్లు అర్జున్ ‘పుష్ప’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ సాలీడ్ హిట్టుగా నిలిచింది.

    ఇక గత నెలలో రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ ఓవరాల్ గా మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’,‘ఆదిపురుష్’ ఈ ఏడాది రిలీజు కానున్నాయి. పవన్ కల్యాణ్ గత నెలలో ఐదో స్థానంలో ఉండగా ఓవరాల్ గా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

    ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐదు స్థానంలో, రాంచరణ్ ఆరో స్థానంలో నిలిచారు. కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది. ఏడో స్థానంలో విజయ్ దేవరకొండ, ఎనిమిదో స్థానంలో నానిలు కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తొమ్మిది, రవితేజ పదో స్థానంలో నిలిచారు. వీరిద్దరు కూడా ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తూ బీజీ బీజీగా గడుపుతున్నారు.